V6 News

బాధ్యతలు స్వీకరించిన నిర్మల్ కొత్త కలెక్టర్‌‌ భవేశ్ మిశ్రా

బాధ్యతలు స్వీకరించిన నిర్మల్  కొత్త కలెక్టర్‌‌ భవేశ్  మిశ్రా

నిర్మల్, వెలుగు: నిర్మల్  కొత్త కలెక్టర్‌‌ భవేశ్  మిశ్రా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు బదిలీపై వెళ్తున్న కలెక్టర్  అభిలాష అభినవ్, అడిషనల్​ కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కిశోర్ కుమార్‌‌, జిల్లా అధికారులు స్వాగతం పలికారు. ఆర్డీవో రత్న కల్యాణి, జిల్లా అధికారులు జీవరత్నం, రాజేందర్, శ్రీనివాస్, నరసింహారెడ్డి, దయానంద్, భోజన్న, సుధాకర్, విజయలక్ష్మి, రమణ, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్  పాల్గొన్నారు. 

అనంతరం కలెక్టర్  భవేశ్ మిశ్రా, త్రిపాఠి దంపతులు బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన కలెక్టర్  దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.