పాప్ సింగర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది స్మిత. ఒకప్పుడు తన ఆల్బమ్స్ సాంగ్ తో ఫుల్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. రీమిక్స్ పాటలతో, అదిరిపోయే ఆల్బమ్స్‌తో కుర్రకారును ఉర్రూతలూగించిన ఆమె, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ అదే జోష్ ప్రదర్శిస్తున్నారు. ఇటీవల తన ల్బమ్స్ పాత సాంగ్ 'మసక మసక చీకటిలో' అంటూ సాగే పాటను రీమిక్స్ చేసి కొత్త స్టైల్‌లో మలిచి మెప్పించిన స్మిత.. లేటెస్ట్ గా సంక్రాంతి కానుకగా ‘భీమవరం బీట్’ (Bhimavaram Beat) అంటూ మరో మాస్ నెంబర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ పాటలో అసలు సిసలైన సర్ప్రైజ్ ఏంటంటే.. ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు (RRR) ఇందులో మెరవడం. ఎప్పుడూ రాజకీయాలు, విశ్లేషణలు, కౌంటర్లతో వార్తల్లో ఉండే ఆయన, ఈ వీడియోలో స్మితతో కలిసి వేసిన స్టెప్పులు నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. నటుడు, ర్యాపర్ నోయల్ సేన్ సహకారంతో రూపొందిన ఈ వీడియో సాంగ్, భీమవరం సంస్కృతిని, సంక్రాంతి సందడిని ప్రతిబింబించేలా ఉంది.
Also Read : ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2
ఆల్బమ్ సాంగ్ కు పొలిటికల్ గ్లామర్
రాజకీయ వేదికల మీద గర్జించే రఘురామ కృష్ణంరాజు, ఈ పాటలో ఎంతో సరదాగా డాన్స్ చేస్తూ కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సంక్రాంతి పండుగ వేళ కోడి పందేలు, సరదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే భీమవరం నేపథ్యంలో ఈ బీట్ సాగుతుంది. చాలా కాలం తర్వాత స్మిత తన మార్కు ఎనర్జీతో, సరికొత్త గెటప్‌లో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియాలో ఈ 'భీమవరం బీట్' ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది. పాలిటిక్స్, ఎంటర్టైన్మెంట్ కలగలిసిన ఈ పాటను చూసి నెటిజన్లు "RRR లో ఈ యాంగిల్ కూడా ఉందా!" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
