V6 News

రాజమండ్రిలో భోగి యాక్షన్ షెడ్యూల్

రాజమండ్రిలో  భోగి యాక్షన్ షెడ్యూల్

సంక్రాంతికి    ‘నారీ నారీ నడుమ మురారి’, రీసెంట్‌‌‌‌‌‌‌‌గా ‘బైకర్’ చిత్రాలతో ఆడియెన్స్ ముందుకొచ్చిన శర్వానంద్.. ప్రస్తుతం తన నెక్స్ట్‌‌‌‌‌‌‌‌ మూవీపై ఫోకస్ పెట్టాడు. సంపత్ నంది దర్శకత్వంలో  తను నటిస్తున్న  యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రం ‘భోగి’.  శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై  కెకె రాధామోహన్  ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నారు.   

ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి కాగా, మంగళవారం నుంచి  రాజమండ్రిలో లెంగ్తీ  యాక్షన్ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ను స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేసినట్టు అప్‌‌‌‌‌‌‌‌డేట్ ఇచ్చారు మేకర్స్.  రంపచోడవరం అడవుల్లో  స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ ఈ యాక్షన్ సీక్వెన్స్‌‌‌‌‌‌‌‌లను  కొరియోగ్రఫీ చేస్తున్నాడు. ఈ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌లో శర్వానంద్‌‌‌‌‌‌‌‌తోపాటు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న నటీనటులు పాల్గొంటున్నారు. 1960 బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్నారు. 

భీమ్స్‌‌‌‌‌‌‌‌ సిసిరోలియో  సంగీతం అందిస్తున్నాడు.  ఫస్ట్ స్పార్క్ పేరుతో ఇప్పటికే విడుదల చేసిన  కాన్సెప్ట్ వీడియోకు మంచి  రెస్పాన్స్ వచ్చింది.  రక్షా బంధన్ పండుగ సందర్భంగా ఆగస్టు 28న  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.