ఎమ్మెల్యే కోసం కాలిన‌డ‌క‌న‌ భువనగిరి టు వేములవాడ

ఎమ్మెల్యే కోసం కాలిన‌డ‌క‌న‌ భువనగిరి టు వేములవాడ

వేములవాడ, వెలుగు: రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ క‌రోనా నుంచి కోలుకుంటే నడిచొచ్చి మొక్కు చెల్లించుకుంటానని రాజన్నను కోరుకున్నాడో వ్యక్తి. అనుకున్నట్టు జరగడంతో సుమారు 128 కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చిరాజన్నను దర్శించుకున్నాడు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ 1990–92 ప్రాంతంలో భువనగిరిలో ఉన్నారు. ఆ సమయంలో గోదావరిఖనికి చెందిన మీనుగు గట్టేష్ కూడా అక్కడే ఉండడంతో పరిచయం ఏర్పడింది.

ఎమ్మెల్యే అక్కడి నుంచి వచ్చేటప్పుడు గట్టేష్ కు ఓ వ్యాపారం అప్పగించి వచ్చారు. అయితే కొన్ని రోజుల కిందట ఎమ్మెల్యే కరోనా బారిన పడడంతో ఆయన కోలుకుంటే వేములవాడ రాజన్న దగ్గరికి కాలినడకన వస్తానని మొక్కుకున్నాడు. అనుకున్నట్టు జరగడంతో చెప్పులు లేకుండా భువనగిరి నుంచి 128 కిలోమీటర్లు నడిచి వేములవాడ రాజన్న సన్నిధికి చేరుకున్నాడు. గురువారం తన ప్రయాణాన్ని మొదలు పెట్టగా వర్షం కురవడంతో ఆదివారం సాయంత్రం వేములవాడకు వచ్చాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం..