మేకలు మొక్కలు తిన్నాయని యజమానికి రూ. 5 వేలు ఫైన్

మేకలు మొక్కలు తిన్నాయని యజమానికి రూ. 5 వేలు ఫైన్

హరితహారం కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. మొక్కలను మేకలు తింటే యజమానులకు జరిమానా విధించిన ఘటనలు  చాలానే ఉన్నాయి. లేటెస్ట్ గా ఇలాంటి ఘటనే యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్ పురం గ్రామపంచాయతీలో జరిగింది. హరితహారంలో నాటిన మొక్కలు మేకలు తిన్నాయని..యజమాని శాపాక జయమ్మ కు రూ. 5000 ఫైన్ వేశారు పంచాయతీ సెక్రెటరీ. ‘హరిత హారం కార్యక్రమలో భాగంగా గ్రామంలో నాటిన  మొక్కలను తిన్నందుకు గ్రామసభ తీర్మానం 01.07.2021 ప్రకారం ఒక్కో మొక్క ఖర్చు రూ. 500 గా మొత్తం 10 మొక్కలకు రూ.5000 జరిమానా విధించడం జరిగింది’ అని బిల్లును మేకకు జతచేశారు.