ఓడిపోతామనే భయంతోనే అరెస్ట్ లు

ఓడిపోతామనే భయంతోనే అరెస్ట్ లు

సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు భూమన్నను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు సర్పంచులు. హుజూర్ నగర్లో నామినేషన్ వేసేందుకు వెళ్తే అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. నిజామాబాద్ ఎంపీ ఎన్నికల్లో ఓడినట్టే… హుజూర్ నగర్ లో ఓడిపోతామనే భయంతోనే అరెస్ట్ లు చేయిస్తున్నారని ఆరోపించారు సర్పంచులు.

సర్పంచ్ లు ఆందోళ కు కారణం?

సర్పంచ్ కు, ఉప సర్పంచ్ కు జాయింట్ చెక్ పవర్ ఇవ్వడం పై గత కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు సర్పంచ్ లు. సర్పంచ్ ల కు మాత్రమే చెక్ పవర్ ఉండాలంటున్నారు. దీంతో పాటు సర్పంచ్ లపై కలెక్టర్ ల పెత్తనం…నిధులు ఇవ్వకపోవడం..ఈ సమస్యలన్నీటిపై హుజర్నగర్ ఉప ఎన్నికలో నామినేషన్ లు వేసి.. తమ సమస్య ను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు సర్పంచ్ లు ప్రయత్నం చేస్తున్నారు. నామినేషన్ లు వేయకుండా ప్రభుత్వం అడ్డుకుంటుంది. అరెస్ట్ లు చేయిస్తుంది.