చెరువును తలపిస్తున్న భూపాలపల్లి ఆసుపత్రి

చెరువును తలపిస్తున్న భూపాలపల్లి ఆసుపత్రి

ఎడతెరిపిలేని వానతో ప్రధాన ద్వారాన్ని ముంచెత్తిన వాన నీరు

రాకపోకలకు తీవ్ర అంతరాయం

జయ శంకర్ భూపాలపల్లి: జిల్లా కేంద్రంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి (జిల్లా క్వరంటెన్ సెంటర్) చెరువును తలపిస్తోంది. నిన్న రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద వరద నీరు భారీగా చేరింది. దీంతో ఆసుపత్రి లోనికి వెళ్లేందుకు తీవ్రంగా ఇబ్బందిపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తప్పనిసరి కావడంతో వైద్యులు, అంబులెన్సు లు ఇతర సిబ్బంది నానా అగచాట్లు పడుతున్నారు. దారి మొత్తం బురదమయంగా మారగా.. ప్రధాన ద్వారం వద్ద  ఏకంగా చెరువులా మారింది. కనుచూపు మేర అంతా నీరు చేరడంతో దారి కనిపించడం లేదు. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వైద్యులు.. వైద్య సిబ్బంది మాటేమోగాని.. రోగులు.. వార ిబంధువులు.. సంరక్షకులు నానా ఇబ్బందులు పడుతున్నారు.