భూపాలపల్లి రూరల్, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కేటీకే 5వ గనిలో బొగ్గును పేల్చేందుకు వాడే పూర్ణి(బాంబు) పేలడంతో కార్మికుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. గని కార్మికులు, ఆఫీసర్లు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఫస్ట్ షిఫ్ట్ లో విధులు నిర్వహించేందుకు షార్ట్ ఫైర్ కార్మికుడు శ్రీరాముల ప్రదీప్ విధులకు హాజరయ్యాడు.
డ్యూటీలో భాగంగా 13వ లెవెల్లో బొగ్గు బ్లాస్టింగ్ చేసేందుకు పూర్ణీలను చెక్ చేస్తున్నాడు. ఈ క్రమంలో చేతిలో ఉన్న పూర్ణి బ్లాస్ట్ కావడంతో ఎడమ అరచేతి భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. తోటి కార్మికులు ప్రదీప్ ను గని బయటకు తీసుకువచ్చి హాస్పిటల్కు తరలించారు. ఏరియా ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించిన డాక్టర్లు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు.
