
మాజీ సీఎం కేసీఆర్, ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 17న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.
మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం వల్ల ప్రజా ధనానికి భారీ నష్టం వాటిల్లిందని భూపాలపల్లి వాసి రాజలింగ మూర్తి జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ ను విచారించిన కోర్టు గతంలో మాజీ సీఎం కేసీఆర్ సహా మరో ఏడుగురు మందికి నోటీసులు పంపింది.
ALSO READ | నీట్ ఎంబీబీఎస్ స్థానికతపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు
నోటీసులు అందుకున్న వారిలో మాజీ మంత్రి హరీష్ రావు , మెగా కృష్ణారెడ్డి, రజత్ కుమార్, ఎల్ అండ్ టి ఎండి సురేష్ కుమార్ , ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్లు హరి రామ్, శ్రీధర్ తరపున న్యాయవాదులు మెమో ఆఫ్ అప్పీయరెన్స్ దాఖలు చేశారు. అయితే కేసీఆర్, ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కోర్టుకు హాజరుకాలేదు. దీంతో అక్టోబర్ 17న విచారణకు హాజరు కావాలంటూ భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి కేసీఆర్,స్మితా సబర్వాల్ కు సమన్లు జారీ చేసింది.