నాకు పెద్దన్నలాంటోడు..మోదీపై భూటాన్ ప్రధాని షెరింగ్​

నాకు పెద్దన్నలాంటోడు..మోదీపై భూటాన్ ప్రధాని షెరింగ్​

న్యూఢిల్లీ: ఇండియా ప్రధాని నరేంద్ర మోదీ తన గురువు, పెద్దన్న అని భూటాన్‌‌ ప్రధాని షెరింగ్‌‌ టోబ్‌‌గే అన్నారు. మోదీ అంటే తనకు ఎంతో గౌరవం అని తెలిపారు. షెరింగ్ టోబ్​గే ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘మోదీ నా బడే భాయ్.. ఆయనంటే నాకు ఎంతో ప్రేమ, గౌరవం. ఆయనతో నాకున్న మంచి అనుబంధానికి ఆనందిస్తున్నాను.

మోదీ భాయ్ ఆశీర్వాదాలు మాపై ఉండాలని కోరుకుంటున్నాను. మోదీని గురువుగా భావిస్తాను. ఆయన మార్గదర్శకంలో ప్రయాణించడం నా అదృష్టం. ఆయన చేసిన ప్రతీ కామెంట్ వెనుక ఎంతో అర్థం ఉంటుంది. చెప్పింది చేసి చూపిస్తారు. ఆయన్ను నేను పెద్దన్నయ్యలా చూస్తాను’’అని షెరింగ్ చెప్పారు.