అలిగిన ఎంపీ కోమటిరెడ్డి.. పార్టీ పదవుల్లో ప్రాధాన్యం దక్కనందునే.. !

అలిగిన ఎంపీ కోమటిరెడ్డి.. పార్టీ పదవుల్లో ప్రాధాన్యం దక్కనందునే.. !
  • అలిగిన ఎంపీ కోమటిరెడ్డి
  • పార్టీ పదవుల్లో ప్రాధాన్యం దక్కనందునే..
  • తన అభిప్రాయాన్ని పీఈసీకి, స్క్రీనింగ్ కమిటీకి చెప్పని వెంకటరెడ్డి
  • బుజ్జగించేందుకు కోమటిరెడ్డి నివాసానికి ఏఐసీసీ నేత సంపత్ కుమార్
  • కోమటిరెడ్డితో ఫోన్ లో మాట్లాడిన కేసీ వేణుగోపాల్

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలకబూనారు. అదే జిల్లాకు చెందిన నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేంద్ర ఎన్నికల కమిటీలో చోటు కల్పించడం.. తనకు కనీసం స్క్రీనింగ్ కమిటీలో కూడా అవకాశం ఇవ్వకపోవటమే ఇందుకు కారణమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అభ్యర్థుల ఎంపికలో అటు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీకి, ఇటు స్క్రీనింగ్ కమిటీకి కూడా తన అభిప్రాయం వ్యక్తం చేయలేదు.

త్వరలో హైదరాబాద్ లో జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశాల ఏర్పాట్లకు సైతం దూరంగా ఉన్నారు. దీంతో అధిష్టానం రంగంలోకి దిగింది. ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ ఫోన్ లో మాట్లాడారు. వెంకటరెడ్డిని బుజ్జగించేందుకు ఏఐసీసీ నేత సంపత్ కుమార్ కోమటిరెడ్డి నివాసానికి చేరుకుని చర్చలు జరిపారు.