హాష్ ఆయిల్ సప్లయర్ అరెస్ట్.. రూ. 42 లక్షల విలువైన ఆయిల్ స్వాధీనం

హాష్ ఆయిల్ సప్లయర్ అరెస్ట్..  రూ. 42 లక్షల విలువైన  ఆయిల్ స్వాధీనం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: హాష్‌‌‌‌ ఆయిల్ సప్లయ్‌‌‌‌ చేస్తున్న డ్రగ్‌‌‌‌ పెడ్లర్‌‌‌‌‌‌‌‌ను యాదాద్రి భువనగిరి ఎస్‌‌‌‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నేరెడ్​మెట్ లోని రాచకొండ కమిషనరేట్ ఆఫీసులో సీపీ డీఎస్ చౌహాన్ వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు గ్రామానికి చెందిన అజ్మీర్‌‌‌‌‌‌‌‌ సూర్య(34) ఎంఏ, బీఈడీ పూర్తి చేశాడు. సిటీకి వచ్చి ఓ ప్రైవేట్ కంపెనీలో కొంత కాలం పని చేశాడు. కరోనా ఫస్ట్ వేవ్​లో అతడి జాబ్ పోయింది. దీంతో తిరిగి సొంతూరుకెళ్లాడు. డెయిరీ ఫామ్ ప్రారంభించాడు. నష్టాలు రావడంతో ఇల్లీగల్ లిక్కర్ బిజినెస్ మొదలుపెట్టాడు. ఏపీలోని గుంటూరులో లిక్కర్ సప్లయ్ చేస్తుండగా గతేడాది స్థానిక ఎక్సైజ్ పోలీసులు సూర్యను అరెస్ట్ చేశారు. 3 కేసుల్లో అతడు నిందితుడు కావడంతో పీడీ యాక్ట్‌‌‌‌ పెట్టి జైలుకు పంపారు. జైలులో వరంగల్‌‌‌‌కు చెందిన గంజాయి సప్లయర్ రాముతో సూర్యకు పరిచయం ఏర్పడింది.  గతేడాది నవంబర్‌‌‌‌‌‌‌‌లో సూర్య, రాము  జైలు నుంచి రిలీజ్ అయ్యారు.

ఒడిశా నుంచి హాష్ ఆయిల్..

వీరిద్దరూ కలిసి హాష్ ఆయిల్ సప్లయ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఒడిశాలోని మల్కాన్‌‌‌‌గిరికి చెందిన సప్లయర్ లక్ష్మణ్‌‌‌‌ వద్ద హాష్‌‌‌‌ అయిల్ కొని హైదరాబాద్, జహీరాబాద్‌‌‌‌కు ట్రాన్స్‌‌‌‌పోర్ట్ చేసేవారు. కార్లలో ట్రావెల్ చేస్తే పోలీసులకు దొరుకుతామని..  బైక్ లపై హాష్‌‌‌‌ ఆయిల్​ను తీసుకొచ్చేవారు. 5 ఎంఎల్‌‌‌‌ హాష్‌‌‌‌ ఆయిల్‌‌‌‌ను రూ.7 వేల నుంచి రూ.7,500 వరకు అమ్మేవారు.  ఇటీవల మల్కాన్​గిరిలో 3 లీటర్ల హాష్‌‌‌‌ ఆయిల్​ను కొన్న వీరిద్దరూ.. హైదరాబాద్, జహీరాబాద్​లోని కస్టమర్లకు సప్లయ్ చేద్దామనుకున్నారు. ఒడిశా నుంచి వరంగల్​ వరకు రైలులో వచ్చిన సూర్య గురువారం రాత్రి  బైక్​పై హైదరాబాద్​కు బయలుదేరాడు. దీని గురించి సమాచారం అందుకున్న యాదాద్రి భువనగిరి ఎస్‌‌‌‌వోటీ,ఆలేరు పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ.42 లక్షల విలువైన 3 లీటర్ల హాష్ ఆయిల్, బైక్, సెల్ ఫోన్​ను స్వాధీనం చేసుకున్నారు. మిగతా ఇద్దరు నిందితులు రాము, లక్ష్మణ్​ పరారీలో ఉన్నట్లు సీపీ చౌహాన్ తెలిపారు.

గంజాయి కేసులో మరో ఐదుగురు ..

ఒడిశా నుంచి సిటీకి గంజాయిని తీసుకొస్తున్న మరో ఐదుగురిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన పెరుమాళ్ల రజనీకాంత్(23), ఊటుకూరి సాత్విక్ రెడ్డి(20), సూర్యాపేట జిల్లాకు చెందిన తోడేటి వంశీ(22), ఖమ్మం జిల్లాకి చెందిన గాడిపల్లి హేమంత్(22), కర్నూల్ జిల్లాకు చెందిన మహ్మద్ సమీర్(23) ఈ ఐదుగురు ఒడిశా నుంచి సిటీకి గంజాయిని తీసుకొస్తుండగా.. ఎల్ బీనగర్ ఎస్ వోటీ, మహేశ్వం పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 5 కిలోల గంజాయి, బైక్,  4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్​కు చెందిన మరో నిందితుడు తిరుపతి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.