వెలుగు, నెట్వర్క్ : పోలీస్ అమర వీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా శనివారం పోలీస్ అమరులను స్మరిస్తూ సైకిల్ ర్యాలీలు నిర్వహించారు. నిజామాబాద్‌లో సీపీ సాయిచైతన్య ఆధ్వర్యంలో సైకిల్, బైక్ ర్యాలీలు నిర్వహించారు. పులాంగ్ చౌరస్తా నుంచి ప్రధాన రోడ్ల మీదుగా నెహ్రూ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. అదనపు డీసీపీలు బస్వారెడ్డి, రాంచందర్‌రావు, ఏసీపీలు రాజావెంకట్‌రెడ్డి, మస్తాన్అలీ తదితరులు ఉన్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో సైకిల్ యాత్ర నిర్వహించగా ఎస్పీ రాజేశ్చంద్ర, ఏఎస్పీ చైతన్యారెడ్డితోపాటు పోలీస్ అధికారులు, సిబ్బంది, 3 వందల మందివ విద్యార్థులు పాల్గొన్నారు. పొందూర్తి చౌరస్తా నుంచి హౌజింగ్ బోర్డు కాలనీ, మెయిన్ రోడ్డు, నిజాంసాగర్ చౌరస్తా, కొత్త బస్టాండు, డిగ్రీ కాలేజీ మీదుగా కళాభారతి వరకు సైకిల్ యాత్ర కొనసాగింది.
కార్యక్రమంలో బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డి, సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుల్స్, విద్యార్థులు పాల్గొన్నారు. వర్ని మండల కేంద్రంలో ఎస్సై మహేశ్ ఆధ్వర్యంలో పోలీసులు సుభాష్‌చంద్రబోస్ చౌరస్తా నుంచి జాకోరా క్రాసింగ్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. నందిపేట మండల కేంద్రంలో ఎస్సై శ్యామ్‌రాజ్ ఆధ్వర్యంలో వివేకానంద చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
కార్యక్రమంలో ఎస్సై2, గ్రామస్తులు పాల్గొన్నారు. బోధన్ పట్టణంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఆచన్‌పల్లి బైపాస్ నుంచి అనిసానగర్, శక్కర్‌నగర్ చౌరస్తా, కొత్తబస్టాండ్, అనిల్ టాకీస్ చౌరస్తా మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్, బోధన్, రూరల్, రుద్రూర్ సీఐలు వెంకట నారాయణ, విజయ్‌బాబు, కృష్ణ, ఎస్ఐలు చంద్రశేఖర్, మచ్ఛేందర్ రెడ్డి, మహేశ్, రమా, సాయన్న, సునీల్, పోలీసు సిబ్బంది, ఉషోదయ కాలేజీ, ఇందూర్, విజయసాయి పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
