భద్రతాధికారిపై బైడెన్ కుక్క దాడి

భద్రతాధికారిపై  బైడెన్ కుక్క దాడి

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పెంపుడు కుక్క 'కమాండర్' వైట్‌‌‌‌ హౌస్‌‌‌‌లోని భద్రతాధికారులకు చుక్కలు చూపిస్తున్నది. ఇప్పటికే తన దూకుడుతనంతో 10 మందిని గాయపరిచిన జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన కమాండర్.. సోమవారం రాత్రి మరో  సీక్రెట్ సర్వీస్ ఆఫీసర్ ను కరిచింది. గాయపడిన ఆ ఆఫీసర్ కు ఘటనాస్థలంలోనే ట్రీట్మెంట్ అందించినట్లు వైట్‌‌‌‌ హౌస్‌‌‌‌ వెల్లడించింది. బాధితుడి ఆరోగ్యం ప్రస్తుతం  నిలకడగానే ఉందని తెలిపింది.

ఈ ఘటనపై  జిల్ బైడెన్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ ఎలిజబెత్ అలెగ్జాండర్  స్పందిస్తూ..వైట్ హౌస్ వాతావరణం పెంపుడు జంతువులకు  స్పెషల్ గా అనిపించడం వల్ల అవి తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయని తెలిపారు. అందుకే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. వైట్ హౌస్ వాతావరణానికి కమాండర్‌‌‌‌ అలవాటు పడేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బైడెన్ పెంపుడు కుక్క అయిన కమాండర్ గతంలో 10 సార్లు సీక్రెట్ సర్వీస్ సిబ్బందిపై దాడి చేసి గాయపరిచింది.