స్టేజ్ పైనే కిందపడిపోయిన అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్

స్టేజ్ పైనే కిందపడిపోయిన అమెరికా ప్రెసిడెంట్  జో బిడెన్

అమెరికా అధ్య క్షుడు జో బిడెన్ ఓ వేడుకలో స్టేజ్ పై  కిందపడిపోయాడు. కొలరాడోలోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఏర్పాటు చేసిన మిలిటరీ గ్రాడ్యుయేట్స్ కార్యక్రమానికి బైడెన్‌ హాజరయ్యారు.  అకాడమీ గ్రాడ్యుయేట్‌లకు  ప్రారంభ ప్రసంగం చేసిన  బిడెన్ క్యాడెట్స్ తో షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్తుండగా స్టేజ్ పై కిందపడ్డాడు.  వెంటనే అక్కడున్న సిబ్బంది బిడెన్ ను పైకి లేపారు. 

బిడెన్ కు ఎలాంటి గాయాలు కాలేదని ఆయన క్షేమంగా ఉన్నారని వైట్ హౌస్ తెలిపింది. స్టేజ్ పై నల్లటి ఇసుక బస్తా తగిలి పడిపోయినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  బైడెన్ గతంలోనూ చాలా సార్లు కింద పడిపోయాడు.  

బిడెన్ కిందపడిపోవడంపై నెటిజన్లు భిన్న రకాల కామెంట్లు చేస్తున్నారు. బిడెన్ కు వయసయిపోయిందని ఇలాంటివి సహజమేనంటూ సెటైర్లు వేస్తున్నారు.