V6 News

భక్తులకు బిగ్‌ అలెర్ట్‌:  ఐనవోలు మల్లన్న దర్శనాలు నిలిపివేత

భక్తులకు బిగ్‌ అలెర్ట్‌:  ఐనవోలు మల్లన్న దర్శనాలు నిలిపివేత

వర్ధన్నపేట,(ఐనవోలు)వెలుగు: హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర 2026, జనవరి సందర్భంగా స్వామి, అమ్మవార్లకు సుధావలి వర్ణ లేపనం(కలరింగ్) జరుగుతున్నందున దర్శనాలు నిలిపివేస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. వచ్చే నెల10 నుంచి 15 వరకు ఆరు రోజులు స్వామి దర్శనాలు, ఆర్జిత సేవలు బంద్ అవుతాయని పేర్కొన్నారు. అదే నెల16న దృష్టి కుంభంతో తిరిగి స్వామి దర్శనాలు కల్పిస్తామని చెప్పారు. భక్తులు  సహకరించాలని ఆలయ కార్యనిర్వాహణాధికారి కందుల సుధాకర్ ,  చైర్మన్ కమ్మగోని ప్రభాకర్, ఉప ప్రధానార్చకులు పాతర్లపాటి రవీందర్ సూచించారు.