IPL 2026 Closing Ceremony: ఐపీఎల్ 2026 క్లైమాక్స్‌కు వచ్చేసింది భయ్యా. ఈ రోజు రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య జరగబోయే ఫైనల్ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఊపిరి బిగబట్టుకుని ఎదురుచూస్తున్నారు. అయితే మ్యాచ్‌కంటే ముందే అహ్మదాబాద్‌లో బాలీవుడ్ స్టార్ట్స్ హంగామా షురూ అయింది. ఈ మెగా ఫైనల్ ముగింపు వేడుకల్లో స్టార్ సింగర్ కైలాష్ ఖేర్ పాటలతో పాటు బాలీవుడ్ స్టార్ల డాన్స్ పర్ఫామెన్స్‌లు ఉండబోతున్నట్లు నెట్టింట వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
స్టేడియంలో ఆర్టిస్టుల రిహార్సల్స్:
ప్రముఖ సింగర్ కైలాష్ ఖేర్ కాసేపట్లో జరిగే ఐపీఎల్ క్లోజింగ్ సెర్మనీలో తన గొంతుతో మ్యాజిక్ చేయబోతున్నట్లు గట్టిగా ప్రచారం జరుగుతోంది. కాగా కైలాష్ ఖేర్ మాస్క్ వేసుకుని అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. దీనికి తోడు నరేంద్ర మోడీ స్టేడియంలో కైలాష్ ఖేర్ పాడిన ఒక పాటకు జూనియర్ ఆర్టిస్టులు గ్రూప్ డాన్స్ రిహార్సల్స్ చేస్తున్న వీడియో కూడా లీక్ కావడంతో.. ఈ రాత్రి ఆయన లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.
అహ్మదాబాద్‌లో వరుణ్, పూజా హెగ్డే, మృణాల్ ల్యాండ్:
కేవలం పాటలే కాదు, బాలీవుడ్ గ్లామర్ కూడా ఈ ఫైనల్ మ్యాచ్‌కు అదనపు ఆకర్షణగా నిలవనుంది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, స్టార్ హీరోయిన్లు పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ లు నిన్ననే అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రత్యక్షమయ్యారు. ఎయిర్‌పోర్టులో వరుణ్ ధావన్ ఫ్యాన్స్‌తో కలిసి స్టెప్పులేయడం విశేషం.. వీరంతా కలిసి నటిస్తున్న సరికొత్త సినిమా ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ ప్రమోషన్స్‌లో భాగంగా ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తుంది. కాసేపట్లో జరగబోయే ఐపీఎల్ ఫైనల్ స్టేజ్ పై వీరు కూడా సందడి చేసే అవకాశం ఉంది.
►ALSO READ | మోడీ స్టేడియంలో ఫైనల్ పోరు.. IPL 2026 కప్ కొట్టేది ఆర్సీబీనా.. గుజరాతా?
హిస్టరీ క్రియేట్ చేసేది ఎవడు?:
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ రెండు జట్లకూ చాలా కీలకం.. ఏ జట్టు గెలిచినా చరిత్ర సృష్టించడం ఖాయం.
* రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB): ఒకవేళ ఆర్సీబీ గెలిస్తే.. ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండోసారి కప్పు కొట్టి, రెండు టైటిల్స్ సాధించిన జట్ల క్లబ్‌లోకి చేరుతుంది.
* గుజరాత్ టైటాన్స్ (GT): గుజరాత్ గెలిచినా కూడా వాళ్లకు ఇది రెండో ఐపీఎల్ ట్రోఫీ అవుతుంది. హోమ్ గ్రౌండ్‌లో గిల్ సేన ఈ ఫీట్ సాధిస్తుందో లేదో చూడాలి.
IPL 2026 closing ceremony: pic.twitter.com/O7yfM4jyf6
— Baljeet Singh (@ImTheBaljeet) May 31, 2026
