మోడీ స్టేడియంలో ఫైనల్ పోరు.. IPL 2026 కప్ కొట్టేది ఆర్సీబీనా.. గుజరాతా?

మోడీ స్టేడియంలో ఫైనల్ పోరు.. IPL 2026 కప్ కొట్టేది ఆర్సీబీనా.. గుజరాతా?

IPL2026Final: క్రికెట్ దునియాలో #IPL2026Final ఫీవర్ పీక్స్‌కు చేరుకుంది. లీగ్ స్టేజ్‌లో చెరో 18 పాయింట్లతో సమజ్జజ్జీలుగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు ఇప్పుడు నరేంద్ర మోడీ స్టేడియంలో ఐపీఎల్ ట్రోఫీ కోసం అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. క్వాలిఫైయర్ 1లో గుజరాత్‌ను 92 రన్స్ తేడాతో ఓడించి ఆర్సీబీ నేరుగా ఫైనల్ చేరితే.. గుజరాత్ మాత్రం క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్‌ను మట్టికరిపించి హోమ్ గ్రౌండ్‌లో ఫైనల్ ఫైట్‌కు రెడీ అయింది. మరి ఈ రాత్రికి గెలిచేదెవరో ఇప్పుడు చూద్దాం..  

టాస్ గెలిచేది ఎవరు?: 
మరీ కొన్నీ గంటల్లో ప్రారంభమయ్యే మ్యాచ్‌లో టాస్ గెలిచే లక్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)కే ఎక్కువ ఉందని ఏఐ ప్రిడిక్షన్లు చెప్తుంది. టాస్ గెలిచిన కెప్టెన్ మొదట బౌలింగ్ ఫస్ట్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఐపీఎల్ 2026 ట్రెండ్ ప్రకారం.. సెకండ్ ఇన్నింగ్స్‌లో టార్గెట్ ఎంతో తెలిస్తే ఛేజింగ్ ఈజీ అవుతుంది. పైగా అహ్మదాబాద్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌లో ‘మంచు’ (Dew) కురిసే అవకాశం ఉండటంతో బౌలింగ్ చేయడం కష్టమైతది. గుజరాత్ టైటాన్స్ గతంలో చెన్నై (CSK) చేతిలో ఫైనల్ ఓడిపోయినప్పుడు మొదట బ్యాటింగ్ చేసింది. కాబట్టి టాస్ గెలిస్తే గుజరాత్‌ను బ్యాటింగ్‌కు దించి దెబ్బకొట్టాలని ఆర్సీబీ ప్లాన్ చేస్తుంది. 

కప్పు కొట్టేది ఆర్సీబీనేనా?: 
ఈ రాత్రి జరిగే ఫైనల్ ఫైట్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కే గెలిచే అవకాశాలు మస్త్ ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగుతున్న ఆర్సీబీ వైపే లెక్కలన్నీ మొగ్గు చూపుతున్నాయి. ఐపీఎల్ హిస్టరీ ప్రకారం క్వాలిఫైయర్ 1 గెలిచిన జట్టు ఫైనల్ మ్యాచ్ గెలిచే ఛాన్స్ 80 శాతం ఉంది. క్వాలిఫైయర్ 1లో గుజరాత్‌ను ఆర్సీబీ చితక్కొట్టింది కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్. గత ఏడాది రజత్ పటిదార్ కెప్టెన్సీలో ఆర్సీబీ తమ ఫస్ట్ ఐపీఎల్ కప్పు కొట్టింది. ఈసారి కూడా అదే సీన్ రిపీట్ చేసి వరుసగా రెండోసారి ట్రోఫీని బెంగళూరుకు పట్టుకెళ్లాలని చూస్తున్నారు. మరోవైపు, గుజరాత్‌కు హోమ్ అడ్వాంటేజ్ ఉన్నా.. ఆర్సీబీ ఉన్న ఫామ్, దొరికిన రెస్ట్ చూస్తుంటే కప్పు వాళ్లదే అనిపిస్తుంది. ఐనా టాస్ పడిందాక ఏం చెప్పలేం.. ఈ రాత్రికి నరేంద్ర మోడీ స్టేడియంలో పూనకాలు లోడింగ్.. 

►ALSO READ | ఐపీఎల్ ట్రోఫీ కోసం టగ్ ఆఫ్ వార్.. గిల్ ‘ప్రిన్స్’గా నిలుస్తాడా? పటిదార్ ‘లెజెండ్’ అవుతాడా!

ఇరు జట్ల అంచనా: 
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB): వెంకటేష్ అయ్యర్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, రసీఖ్ సలామ్ దార్, జాకబ్ డఫీ.
ఇంపాక్ట్ ప్లేయర్: రొమారియో షెపర్డ్

గుజరాత్ టైటాన్స్ (GT): సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), నిశాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, కగిసో రబడా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్షద్ ఖాన్ / సాయి కిషోర్.
ఇంపాక్ట్ ప్లేయర్: రాహుల్ తెవాటియా