బిగ్ బాస్ షోను నిలిపివేయాలి..జూబ్లీహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు

బిగ్ బాస్ షోను నిలిపివేయాలి..జూబ్లీహిల్స్ పీఎస్ లో  ఫిర్యాదు

జూబ్లీహిల్స్, వెలుగు: తెలుగు బిగ్​బాస్ షోను వెంటనే నిలిపివేయాలని గజ్వేల్​కు చెందిన కొందరు యువకులు జూబ్లీహిల్స్ పీఎస్​లో గురువారం ఫిర్యాదు చేశారు.  బిగ్ బాస్ షో  హద్దులు మీరి  నడుస్తోందని, అందులోని అభ్యంతరకర సంభాషణలు, అశ్లీల కంటెంట్ యువతను తప్పుదారి పట్టిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. బిగ్​బాస్​షోను ఆపకపోతే మహిళా సంఘాలతో కలిసి అన్నపూర్ణ స్టూడియోలోని సెట్​ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కర్నాటకలో బిగ్ బాస్​ను నిలిపివేసినట్లు ఇక్కడ కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు ఇచ్చిన వారిలో కమ్మరి శ్రీనివాస్, రవీందర్ రెడ్డి 
తదితరులు ఉన్నారు.