పార్ట్ టైం జాబ్ పేరుతో భారీ మోసం... రూ. 4 కోట్లతో పరార్..

పార్ట్ టైం జాబ్ పేరుతో భారీ మోసం... రూ. 4 కోట్లతో పరార్..

 పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న ముఠాని సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఇందు సంబంధించి సైబర్ క్రైమ్ డీసీపీ కవతి మీడియా సమావేశం నిర్వహించారు. అబ్దుల్లా ఫరూక్, మహమ్మద్ షోయబ్ బబ్లూ ఖాన్ అనే ఇద్దరు వ్యక్తులు టికెట్స్ బుకింగ్ టాస్క్ లు ఇచ్చి ప్రజలను మోసం చేశారని చెప్పారు. బాధితులకు నమ్మకం కలిగించేందుకు ముందుగా అకౌంట్ లో రూ. 500  లాభంగా వేసి ఎక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు ఇస్తామని ఆశ చూపి లక్షల్లో వసూలు చేశారని చెప్పారు. 

కట్టిన డబ్బు రావాలంటే మరికొంత పెట్టుబడి పెట్టాలని బెదిరింపులకు గురి చేసి మరింత డబ్బులు లాగారని అన్నారు.  ఎంత కట్టిన డబ్బు వెనక్కి రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను సంప్రదించారని చెప్పారు. పోలీసులు దర్యాప్తు చేయగా కొల్లగొట్టిన డబ్బును షోయబ్ బబ్లూ ఖాన్ అకౌంట్ లో క్రెడిట్ చేశారని తెలిసిందన్నారు. షోయబ్ అకౌంట్ ను ఫ్రీజ్ చేశామని అందులో రూ. 4 కోట్ల 50 లక్షల గుర్తించామని అన్నారు.

 తెలంగాణకి చెందిన ఆరుగురు ఈ ముఠా చేతిలో మోసపోయారని చెప్పారు. హైదరాబాద్ కి చెందిన 3 కేసుల్లో రూ. కోటి 20 లక్షలు, రాచకొండకి చెందిన ఒక కేసులో రూ. 65 లక్షలు, సైబరాబాద్ కి చెందిన రెండు కేసుల్లో రూ. 10 లక్షలు దోచుకున్నట్టు విచారణలో తెలిసిందన్నారు. నిందితుల దగ్గర నుంచి రూ. 5 లక్షల క్యాష్ 76 చెక్ బుక్స్, 110 డెబిట్ కార్డ్స్, 28 సిమ్ కార్డ్స్, 11 పాస్ బుక్స్, 9 మొబైల్ ఫోన్స్ , రెండు ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నామని డీసీపీ తెలిపారు.