జస్ట్ మిస్.. పాక్ ప్రధాని ఇంటి దగ్గర బాంబ్ పేలుడు .. బంకర్ లోకి షాబాజ్..!

జస్ట్ మిస్.. పాక్ ప్రధాని ఇంటి దగ్గర బాంబ్ పేలుడు .. బంకర్ లోకి షాబాజ్..!

ఎదురు దాడులతో పాకిస్తాన్ కు కౌంట్ డౌన్ మొదలైనట్లే.. లాహోర్, సియాల్‌కోట్, ఇస్లామాబాద్, బహవల్‌పూర్‌లలో  పాక్ దాడులను భారత్ తిప్పికొడుతోంది. ఇరు దేశాలు డ్రోన్లు,మిసైళ్లతో దాడులు చేసుకుంటున్నాయి. పాక్ డ్రోన్లను భారత సైన్యం ధ్వంసం చేస్తోంది.ఈ క్రమంంలోనే యుద్ధ వాతావరణ నెలకొంది. పాకిస్తాన్ నుంచి వచ్చిన మిసైళ్లను  S-400 వ్యవస్థ గాల్లోనే అడ్డుకుని ధ్వంసం చేసింది.

మరో వైపు ఇస్లామాబాద్ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నివాసానికి అత్యంత సమీపంలో  పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. 20.కి.మీ పరిధిలోనే ఈ ఘటన జరగడంతో వెంటనే షరీఫ్ ను వ్యక్తిగత సిబ్బంది సురక్షిత బంకర్ లోకి తరలించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా  సమాచారా రావాల్సి ఉంది. 

భారత ప్రతీకార దాడుల్లో రెండు JF-17 యుద్ధ విమానాలు కోల్పోయినట్లు పాకిస్థాన్ అధికారికంగా ప్రకటించింది..  భారత్ ఎదురుదాడి తర్వాత పాకిస్తాన్‌లో భయాందోళనలు నెలకొన్నాయి.  లాహోర్,  ఇస్లామాబాద్, కరాచీ, బహవల్పూర్‌లలో సైరన్‌లు మోగుతున్నాయి.