
అంతరిక్షంలోకి నాసాతో పోటీగా వ్యోమగాములను పంపాలనే ఎలాన్ మస్క్ డ్రీమ్ కలగానే మిగిలిపోతోంది. 2023 నుంచి తన స్పేస్ ఎక్స్ సంస్థ నుంచి ప్రయోగించాలని ప్రయత్నిస్తున్న స్టార్ షిప్ విఫలమవుతూనే వస్తోంది. ఇప్పటికే పలు మార్లు ప్రయోగించిన తర్వాత పేలిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఎంతో పకడ్బందీగా మరోసారి స్పేస్ లోకి పంపించాలనుకున్న ప్రయోగం విఫమైంది. ఒక్క సారిగా అగ్నిపర్వతం పేలినట్లుగా భారీ విస్ఫోటనం జరిగింది.
గురువారం (జూన్ 19) టెక్సాస్ లోని SpaceX సెంటర్ లో ప్రయోగానికి ముందే Starship షిప్ ఒక్కసారిగా పేలిపోయింది. భారీ శబ్దంతో మంటలు ఎగసిపడటం చూస్తుంటే అగ్నిపర్వతం పేలిన సీన్ కనబడింది. త్వరలో ప్రయోగించనున్న Ship-36 ను టెస్ట్ చేశారు. ఇంజిన్ ఇగ్నిషన్ మండించి ప్రయోగానికి సిద్ధంగా ఉందో లేదో పరీక్షించారు. అయితే ఈ ప్రయోగంలో ఇంజిన్ ఇగ్నిషన్ ఒక్కటే మండుతుంది.. కానీ షిప్ ఎగరకుండా పరీక్షించడం జరుగుతుంది. దీన్ని ఫైనల్ సిస్టం చెక్ గా పరిగణిస్తారు.
స్పేష్ షిప్ పేలిపోవడంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయని.. తునాతునకలై స్టేషన్ మొత్తం పడిపోయాయని ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
2025, జూన్ 29న స్పేస్ షిప్ స్టార్ షిప్ ను నింగిలోకి పంపాలని టార్గెట్ గా పెట్టుకుంది. అందులో భాగంగా నిర్వహించిన పరీక్షలో భారీ పేలుడు సంభవించడం ఎలాన్ మస్క్ కు ఎదురుదెబ్బగా భావిస్తు్న్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్పేస్ ప్రోగ్రాం నిర్వహించే లక్ష్యంలో ఉన్న స్పేస్ ఎక్స్ కు ఇది 10వ ప్రయోగం. జూన్ 29న సక్సెస్ చేయాలని భావిస్తున్న తరుణంలో పేలుడు సంభవించడం ఆందోళన కలిగించే అంశం.
ANOMALY! Just before Ship 36 was set to Static Fire, it blew up at SpaceX Masseys!
— NSF - NASASpaceflight.com (@NASASpaceflight) June 19, 2025
Live on X and YT:https://t.co/GPjZIX1Zyd pic.twitter.com/CfZhDeSGae