
బెంగళూరు: మెట్రో ప్రయాణికులకు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) బిగ్ షాక్ ఇచ్చింది. 2025, ఫిబ్రవరి 9వ తేదీ నుంచి మెట్రో టికెట్ ధరలను దాదాపు 50 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఛార్జీల స్థిరీకరణ కమిటీ సిఫార్సుల మేరకు ఛార్జీలను హైక్ చేసినట్లు బెంగుళూరు మెట్రో యాజమాన్యం వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం (ఫిబ్రవరి 9) బీఎంఆర్సీఎల్ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే.. టికెట్ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించి ప్రయాణికులకు బ్యాడ్ న్యూ్స్ చెప్పిన మెట్రో.. ఒక శుభవార్త కూడా చెప్పింది.
స్మార్ట్ కార్డులపై ప్రయాణికులకు 10 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. స్మార్ట్ కార్డులపై పీక్ అవర్లో 5 శాతం, నాన్ పీక్ అవర్లో 10 శాతం డిస్కౌంట్ వర్తించనుంది. అలాగే.. అన్ని ఆదివారాలు, జాతీయ సెలవు దినాలలో స్మార్ట్ కార్డులపై 10 శాతం చొప్పున డిస్కౌంట్ ఆఫర్ ఉంటుందని మెట్రో రైలు అధికారులు తెలిపారు. బీఎంఆర్సీఎల్ తాజా ధరల పెంపు నిర్ణయంతో మెట్రో టికెట్ గరిష్ట ఛార్జీ రూ.60 నుంచి రూ.90కి చేరుకుంది.
ALSO READ | Facebook లవర్ను కలిసేందుకు పాక్ బార్డర్ దాటాడు.. పేరు మార్చుకున్నాడు.. చివరికి ఏమైందంటే..
ఇటీవల కర్నాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం ఆర్టీసీ బస్సు ఛార్జీలను 15 శాతం మేర పెంచింది. ఆర్టీసీ టికెట్ ధరల పెంపుతో ప్రయాణికులు దానికి ప్రత్యామ్నాయంగా మెట్రోను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో మెట్రో టికెట్ ధరలను కూడా పెంచడంపై ప్రయాణకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులో ట్రాఫిక్ రద్దీని తట్టుకోలేక మెట్రోను ఆశ్రయిస్తుంటే.. ఇక్కడ కూడా చార్జీల పెంపు పేరుతో సామాన్యులపై భారం మోపడం సరికాదంటున్నారు.
సవరించిన మెట్రో ఛార్జీల ధరలు
0-2 కి.మీ: రూ. 10
2-4 కి.మీ: రూ. 20
4-6 కి.మీ: రూ. 30
6-8 కి.మీ: రూ. 40
8-10 కి.మీ: రూ. 50
10-12 కి.మీ: రూ. 60
15-20 కి.మీ: రూ. 70
20-25 కి.మీ: రూ. 80
25-30 కి.మీ మరియు అంతకంటే ఎక్కువ: రూ.90