ఐపీఎల్ సందడి మొదలయింది. అభిమానులంతా తమ హోమ్ టీంను డిఫరెంట్ స్టైల్స్ లో చీర్ చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని పూజలు చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఐపీఎల్ నయా సీజన్ మొదలవనుంది. ఈ క్రమంలో సీజన్ మొదలవకముందే ఒక్కో జట్టుకు వరుస షాక్ తగులుతోంది. తాజాగా హైదరాబాద్ హోం టీం.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు పెద్ద షాక్ తగిలింది.
ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లకు సౌతాఫ్రికా ప్లేయర్లు దూరం కానున్నారు. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ కు అర్హత సాధించాలంటే నెదర్లాండ్స్ తో జరిగే వన్డే సిరీస్ ను తప్పక గెలవాల్సి ఉంటుంది. ఈనెల 31, ఏప్రిల్ 2న నెదర్లాండ్స్ లో జరిగే సిరీస్ కీలకం కావడంతో సౌతాఫ్రికా పూర్తిస్థాయి టీంతో బరిలోకి దిగే ఆలోచన చేస్తోంది.
ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ కెప్టెన్ మార్క్రమ్, బౌలర్ క్లాసెన్, జాన్సన్ ఐపీఎల్ తొలి మ్యాచ్ లకు అందుబాటులో ఉండరనే వార్తులు వినిపిస్తున్నాయి. ఈ జాబితాలో డికాక్(లక్నో), మిల్లర్ (గుజరాత్), రబడా(పంజాబ్), నోర్జే(ఢిల్లీ), ఎంగిడి(ఢిల్లీ), సిసంద (చెన్నై) ఉన్నారు. వీళ్లంతా తమ జట్లకు తొలి మ్యాచ్ లకు దూరం అవనున్నారు.