మదనపల్లె బాలిక అత్యాచారం కేసు.. చెరువులో దొరికిన నిందితుడి డెడ్ బాడీ

మదనపల్లె బాలిక అత్యాచారం కేసు.. చెరువులో దొరికిన నిందితుడి డెడ్ బాడీ

అన్నమయ్య జిల్లా: ఏపీలో సంచలనం రేకెత్తించిన మదనపల్లె బాలిక అత్యాచారం కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కులవర్ధన్ కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని కణసానోలపల్లి చెరువులో శవమై తేలినట్లు పోలీసులు గుర్తించారు. మదనపల్లి పట్టణం నీరు గట్టుపల్లిలో ఏడేళ్ల బాలికపై నిందితుడు అత్యాచారానికి పాల్పడి ఆ పాపను అమానుషంగా హత్య చేసిన ఘటన ఏపీలో తీవ్ర సంచలనం రేకెత్తించింది.

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మంగళవారం ఏడేళ్ల బాలిక అదృశ్యమైంది. తమ కూతురు కనిపించడం లేదని పాప కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. పాప కోసం పోలీసులు వెతుకులాట సాగించగా.. ఇంటికి దగ్గరలోనే ఆ బాలిక డ్రమ్ములో శవమై కనిపించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఆ బాలిక మృతదేహానికి వైద్య పరీక్షలు నిర్వహించగా బాలికను అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా వైద్యులు నిర్ధారించారు.

ఆ బాలిక ఇంటికి సమీపంలో ఉండే కులవర్ధన్ అనే యువకుడిపై అనుమానం వచ్చింది. ఈ ఘటన జరిగినప్పటి నుంచి కులవర్ధన్ పరారవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. పాపను హత్య చేసి డ్రమ్మును కుక్కినట్లు పోలీసులు నిర్ధారించారు. కులవర్ధన్ కోసం పోలీసులు వెతుకులాట సాగించారు. అయితే.. బుధవారం ఉదయం కులవర్ధన్ డెడ్ బాడీ చెరువులో దొరికింది.