యూఏఈలో రెండున్నర రోజులు వీకెండ్ హాలీ డేస్

యూఏఈలో రెండున్నర రోజులు వీకెండ్ హాలీ డేస్

దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వారాంతం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. శని, ఆదివారాలను సెలవు దినాలుగా ప్రకటించింది. ప్రపంచ మార్కెట్లతో మరింత అనుసంధానం అయ్యేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ అధికార మీడియా డబ్ల్యూఏఎం వెల్లడించింది. ఇకపై దేశంలో మొత్తం నాలుగున్నర రోజులు మాత్రమే పనిదినాలు ఉంటాయని స్పష్టం చేసింది. వచ్చే ఏడాది నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. కాగా, ప్రస్తుతం యూఏఈలో శుక్ర, శనివారాలు సెలవు దినాలుగా ఉన్నాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 2022 జనవరి 1వ తేదీ నుంచి వీకెండ్ హాలీ డేస్ శుక్రవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆదివారం ముగిసే వరకు కొనసాగుతాయి.