ఇందూర్​ ముంగిట్లో ఉపాధి అవకాశాలు : గణేశ్​గుప్తా

ఇందూర్​ ముంగిట్లో ఉపాధి అవకాశాలు :  గణేశ్​గుప్తా
  • ఐటీ హబ్​తో జిల్లాకు ప్రయోజనం

నిజామాబాద్, వెలుగు: సాఫ్ట్​వేర్ ​కొలువుల కోసం యువత వేరే ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా నిజామాబాద్​ గడ్డపై ఐటీ హబ్​ఏర్పాటు చేయించినట్లు అర్బన్ బీఆర్ఎస్ ​అభ్యర్థి బిగాల గణేశ్​గుప్తా తెలిపారు. మంగళవారం ఆయన నగరంలోని 19, 20 డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. లా అండ్​ఆర్డర్​సరిగా ఉంటే పెట్టుబడులు పెట్టడానికి అంతర్జాతీయ కంపెనీలు వస్తాయన్నారు. అర్బన్​లో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పడం వల్లే ఇక్కడి ఐటీ హబ్​విదేశీ కంపెనీలను ఆకర్షిస్తోందన్నారు. 

నిరంతంర జాబ్​మేళాలు నిర్వహించి యూత్​కు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. రఘునాథ చెరువును మినీ ట్యాంక్​బండ్ ​చేశానన్నారు. ఎల్లమ్మగుట్ట రైల్వే కమాన్ ​వద్ద ఆర్​యూబీ నిర్మాణం చేయించి ప్రజల ట్రాఫిక్​ కష్టాలు తీర్చానన్నారు. శ్మశానవాటికల్లో ఆధునిక సౌలత్​లు కల్పించినట్లు చెప్పారు. మరోసారి గెలిపిస్తే 24 గంటల మంచినీరు అందిస్తానని, ప్రతి ఇంటికీ అండర్​ గ్రౌండ్ ​డ్రైనేజీ నిర్మిస్తానన్నారు. అభివృద్ధి, సంక్షేమ పాలన కోసం బీఆర్ఎస్​ను ఆశీర్వదించాలన్నారు. కార్యకర్తల ర్యాలీ మధ్య గణేశ్​ గుప్తా ప్రచారం కొనసాగింది. మేయర్​ దండు నీతూకిరణ్, జగత్​రెడ్డి, రాజేందర్, సుగుణ లక్ష్మణ్, సుజన్, యెండల ప్రసాద్, వేముల భూమేశ్​పాల్గొన్నారు.


సీఎం సభ ఏర్పాట్ల పరిశీలనప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించడానికి సీఎం కేసీఆర్ ​బుధవారం నగరానికి వస్తున్న నేపథ్యంలో గణేశ్​ గుప్తా ఏర్పాట్లను పరిశీలించారు. జీజీ కాలేజీ మైదానంలో సభ జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు కేసీఆర్​ రానున్నారు.