ఖమ్మంలో బిగ్‌‌‌‌‌‌‌‌బాస్కెట్‌‌‌‌‌‌‌‌ క్విక్ డెలివరీ .. 10 నిమిషాల్లోనే ఇంటికి సరుకులు

ఖమ్మంలో బిగ్‌‌‌‌‌‌‌‌బాస్కెట్‌‌‌‌‌‌‌‌ క్విక్ డెలివరీ .. 10 నిమిషాల్లోనే ఇంటికి సరుకులు

హైదరాబాద్, వెలుగు: టాటా గ్రూప్‌‌‌‌‌‌‌‌కు చెందిన సంస్థ క్విక్​ కామర్స్​ కంపెనీ  బిగ్‌‌‌‌‌‌‌‌బాస్కెట్‌‌‌‌‌‌‌‌ ఖమ్మం నగరంలో క్విక్​ డెలివరీ సేవలను ప్రారంభించింది.  ఖమ్మం నగరవాసులు తాజా పండ్లు, కూరగాయలు, ఎలక్ట్రానిక్స్,  వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు సహా 10 వేలకు పైగా వస్తువులను కేవలం 10 నిమిషాల్లో ఇంటి దగ్గరే డెలివరీ తీసుకోవచ్చని తెలిపింది. 

ఖమ్మం ఒక వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా మారుతున్నదని, ఇక్కడి వాళ్లు త్వరగా డెలివరీలను కోరుకుంటున్నారని బిగ్​బాస్కెట్​ నేషనల్ బిజినెస్ హెడ్ -( టియర్ 2) శశి శేఖర్ అన్నారు.  తమ కంపెనీ దేశంలోని 200కి పైగా నగరాలలో సేవలందిస్తోందని పేర్కొన్నారు. ప్రతి నెలా సుమారు 80 లక్షల ఆర్డర్లను పది నిమిషాల్లోపే డెలివరీ ఇస్తున్నామని వివరించారు.