Bigg Boss 19: హిందీ ‘బిగ్‌బాస్‌ 19’ విన్నర్ ఎవరు? అతనికి వచ్చిన ప్రైజ్‌ మనీ ఎంత.?

Bigg Boss 19: హిందీ ‘బిగ్‌బాస్‌ 19’ విన్నర్ ఎవరు? అతనికి వచ్చిన ప్రైజ్‌ మనీ ఎంత.?

ఇండియాలో కింగ్ ఆఫ్ రియాలిటీ షోస్ అనిపించుకున్న బిగ్‌‌‌‌బాస్.. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఓ వైపు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 రసవత్తరంగా సాగుతుంటే.. మరోవైపు హిందీలో బ్లాక్ బ‌స్ట‌ర్ రియాలీటి షోస్లో ఒకటైన సీజన్ 19కి (Bigg Boss 19) ఎండ్ కార్డ్ పడింది. కొట్లాటలు, వివాదాలు, సెటైర్లు, అచ్చిరాని కామెడీ పంచులతో రసవత్తరంగా సాగిన ఈ షో ముగిసింది. టీవీ స్టార్ గౌరవ్ ఖన్నా.. నటి ఫర్హానా భట్‌ను ఓడించి బిగ్ బాస్ సీజన్ 19 ట్రోఫీని అందుకున్నారు. 

సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 19 సీజన్ 105 రోజుల పాటు వివాదాస్పందంగా నిలుస్తూ వచ్చింది. అయినప్పటికీ టీఆర్పీ రేటింగ్లో మాత్రం దూకుడు కొనసాగించింది. ఎట్టకేలకు ఆదివారం (2025 డిసెంబర్ 7న) ఈ  సీజన్ 19 గ్రాండ్ ఫినాలే షో ముగిసింది. నటుడు గౌరవ్ ఖన్నా 19వ  సీజన్ ట్రోఫీ విజేతగా నిలిచారు.

ఈ సందర్భంగా బిగ్ బాస్ యాజమాన్యం అతనికి రూ.50 లక్షల ప్రైజ్ మనీ బహుకరించింది. అదే సమయంలో నటి ఫర్హానా భట్ మొదటి రన్నరప్‌గా నిలిచింది. ఫర్హానా కంటే ముందు, ప్రణిత్ మోర్ , తాన్యా మిట్టల్ మరియు అమల్ మల్లిక్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన రియాలిటీ షో నుండి నిష్క్రమించారు. ఈ సీజన్ ఆగస్టు 24న 18 మంది కంటెస్టెంట్స్ మొదలైంది. హోస్ట్ సల్మాన్ ఖాన్ నాయకత్వంలో, హౌస్ ఐదుగురు ఫైనలిస్టులకు కుదించబడింది. చివరగా ట్రోఫీ విజేతగా నటుడు గౌరవ్ ఖన్నా నిలిచారు. 

టీవీ స్టార్ గౌరవ్‌ కన్నా:

బాలీవుడ్‌ బుల్లితెర నటుడిగా, యాంకర్‌గా గౌరవ్ ఖన్నాకు చాలా గుర్తింపు ఉంది. CID వంటి పాపులర్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ సీరిస్‌లో ఆయన నటించారు. గతేడాదిలో జరిగిన సెలబ్రిటీ మాస్టర్‌ చెఫ్‌ కార్యక్రమంలో కూడా ఆయన 12 మందితో పోటీ పడి విజేతగా నిలిచారు. ఇప్పుడు బిగ్‌బాస్‌ 19 విన్నర్‌గా నిలిచి బాలీవుడ్‌లో మరింత పాపులారిటీ తెచ్చుకున్నారు.

తెలుగు బిగ్ బాస్ సీజన్ 9:

తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం 14వ వారం కొనసాగుతోంది. రోజు రోజుకు ఉత్కంఠతను రేపుతోంది. 13 వారం ఎలిమినేషన్ ప్రేక్షకులకు ఊహించని షాక్ ఇచ్చింది.  గత కొన్ని వారాలుగా లీస్ట్ ఓటింగ్ లో సేవ్ అవుతూ వస్తున్న సుమన్ శెట్టి, సంజన ఎలిమినేట్ అవుతారని అందరూ భావించారు. కానీ బిగ్ బాస్ ఇచ్చిన బిగ్ ట్విస్ అందరి అంచనాలను తలకిందులు చేసింది. రీతూ చౌదరి ఎలిమినేట్ అయింది.

హౌస్ టాస్క్‌ల పరంగా సంజన, సుమన్ శెట్టి కంటే రీతూకు తిరుగులేదు. ఏ టాస్క్ ఇచ్చినా బెస్ట్ ఇచ్చేది. ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్క్‌లలో కూడా టాప్ 2 వరకూ వచ్చింది. అయినప్పటికీ, బిహేవియర్ కారణంగా టాప్-5 చేరకుండానే ఆమె జర్నీ ఎండ్‌కార్డ్ పడింది. రీతూ ఎలిమినేట్ కావడంతో హౌస్‌మేట్స్ అందరూ షాక్‌కు గురయ్యారు. ముఖ్యంగా ఆమెతో రిలేషన్‌లో ఉన్న డెమాన్ పవన్ కన్నీళ్లు పెట్టుకుని రీతూకు వీడ్కోలు చెప్పాల్సి వచ్చింది.