Bigg Boss 9: బిగ్‍బాస్ షాకింగ్ ఎలిమినేషన్... కంటెంట్ ఉన్నా దివ్య ఔట్?

 Bigg Boss 9: బిగ్‍బాస్ షాకింగ్ ఎలిమినేషన్... కంటెంట్ ఉన్నా దివ్య ఔట్?

గ్ బాస్ ఎలిమినేషన్ ప్రక్రియ ఈ వారం మరింత ఆసక్తికరంగా మారింది. గతవారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు గౌరవ్, నిఖిల్ ఇద్దరూ ఒకేసారి బయటకు వెళ్లిపోవడంతో, ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేదెవరు అనే చర్చ మొదలైంది. ఊహాగానాలకు తెరదించుతూ, ఈ వారం ఓటింగ్ సరళి ప్రకారం ఒక బలమైన కంటెస్టెంట్ బయటకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.

ఈ వారం నామినేషన్స్  ఓటింగ్ ట్రెండ్

ఈ వారం నామినేషన్స్‌లోకి మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ వచ్చారు. కళ్యాణ్, పవన్, ఇమ్మాన్యుయేల్, భరణి, సంజన, దివ్య నికితా. ఎన్ని వారాలుగానో మిస్ అవుతూ వచ్చిన ఇమ్ము తొలిసారి నామినేషన్స్‌లోకి రావడం అభిమానుల్లో టెన్షన్‌ను పెంచింది. అయితే, ఫ్యాన్ బేస్ బలంగా ఉన్న ఇమ్ముకు భారీగా ఓట్లు పోలవడంతో... టాప్ 1లో  కళ్యాణ్ , టాప్ 2లో ఇమ్మాన్యుయేల్ ఉన్నారు. ఈ తరువాతి స్థానాల్లో పవన్, భరణి నిలబడ్డారు. దీంతో సంజన, దివ్య నికితా డేంజర్ జోన్‌లోకి వచ్చారు.

 దివ్యపై పెరిగిన నెగెటివిటీ..

డేంజర్ జోన్‌లో ఉన్న ఇద్దరు లేడీ కంటెస్టెంట్స్‌లో హీరోయిన్ సంజన కంటే దివ్య నికితా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని రివ్యూవర్లు, సోషల్ మీడియా అంచనా వేస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం దివ్య గేమ్ కంటే కూడా ఆమె వ్యక్తిగత ఘర్షణలు, తనూజతో తరుచూ గొడవలు పడటం. శుక్రవారం ఎపిసోడ్‌లో కెప్టెన్సీ రేసు నుంచి తనూజను తప్పించడానికి దివ్య ఓటు వేయడం. నీకు ఇప్పటికే రెండు వారాల ఇమ్యూనిటీ ఉంది, ఇప్పుడు కెప్టెన్సీ అవసరం లేదు అని చెప్పడం.. వీరి మధ్య మరో పెద్ద వాగ్వాదానికి దారితీసింది. తనూజ-దివ్యల మధ్య పర్సనల్ ఎటాక్‌లు పెరగడం ప్రేక్షకుల దృష్టిలో దివ్యపై నెగెటివిటీని పెంచింది. నామినేషన్స్‌లో ఉన్న మిగతా కంటెస్టెంట్స్‌తో పోలిస్తే, దివ్యకు బయట నుంచి ఓటు బ్యాంక్ బలహీనంగా ఉండటం ఆమెకు మైనస్‌గా మారింది.

 బిగ్ బాస్ గేమ్ ఏంటి?

ఓటింగ్ ట్రెండ్ ప్రకారం దివ్య చివరి స్థానంలో ఉన్నప్పటికీ, ఆమె ఎలిమినేషన్ గురించి ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. దివ్య హౌస్‌లో తరచుగా అరుస్తూ, గొడవ పడటం వల్ల షోకు కావాల్సినంత 'కంటెంట్' లభిస్తోంది. ఈ 'కంటెంట్ ఫ్యాక్టర్' కారణంగా బిగ్ బాస్ టీమ్ ఆమెను ఎలిమినేషన్ నుంచి తప్పించే అవకాశం ఉందని, సంజన లేదా మరెవరైనా అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎలిమినేషన్ ఉండొచ్చని కొందరు రివ్యూవర్స్ అంచనా వేస్తున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం, అత్యల్ప ఓట్లు పొందిన కారణంగా దివ్య నికితా ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే, హౌస్‌లో కామనర్ కంటెస్టెంట్స్‌గా కేవలం కళ్యాణ్, పవన్ మాత్రమే మిగిలి ఉంటారు.

ఈ వారం హోస్ట్ నాగార్జున వేదికపై ఎవరి పేరు ప్రకటిస్తారు? ఊహించినట్లుగానే దివ్య ఔట్ అవుతుందా? లేక కంటెంట్ కోసం బిగ్ బాస్ టీమ్ మరేదైనా నిర్ణయం తీసుకుంటుందా? ఈ సస్పెన్స్‌కు తెరపడాలంటే వీకెండ్ ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.