Bigg Boss Telugu 2.0: బిగ్‌బాస్ హౌస్‌లో దువ్వాడ మాధురి దూకుడు.. ఓవర్ యాక్షన్ పై హౌస్‌మేట్స్ ఫైర్!

Bigg Boss Telugu 2.0: బిగ్‌బాస్ హౌస్‌లో దువ్వాడ మాధురి దూకుడు.. ఓవర్ యాక్షన్ పై హౌస్‌మేట్స్ ఫైర్!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. ఒకే సారి ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌ ఎంట్రీతో షోకు ఫుల్ జోష్ ను తీసుకువచ్చింది. ఆటలో డ్రామా, గొడవలు, వ్యక్తిగత విమర్శలు నెక్స్ట్ లెవెల్‌కి చేరాయి.  హౌస్ లో వారు చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. ముఖ్యంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన దివ్వెల మాధురి హౌస్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి నిత్యం ఎవరో ఒకరితో వాదనలకు దిగుతూ సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది. మాధురి వర్సెస్ హౌస్‌మేట్స్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. కంటెంట్ కోసం మాధురి ఓవరాక్షన్ చేస్తుందని హౌస్‌మేట్స్ బహిరంగంగానే విమర్శించడం కలకలం రేపింది. 38వ రోజు ఎపిసోడ్ చూస్తే రణరంగాన్ని తలపించేలా ఉంది.

మాధురి-సంజనల మధ్య మాటల యుద్ధం

ఉదయం లేచిన వెంటనే హౌస్ లో గొడవ స్టార్ట్ అయింది.  బాత్‌రూమ్‌లో ఉంచిన తన కలర్ స్టిక్కర్స్‌ని ఎవరు తీశారని మాధురి  ప్రశ్నించింది. సంజన తనే పడేశానని ఒప్పుకుంది. డిసిప్లిన్ కోసం పడేశాను అని సంజన చెప్పడంతో..  మాధురి ఆవేశంతో రెచ్చిపోయింది. ఏంటిది కామెడీనా? లేక గుడ్డు దొంగతనం చేసినట్టే స్టిక్కర్స్ కూడా దొంగతనం చేశారా? మీకు దొంగతనం అలవాటేమో అంటూ సంజనను టార్గెట్ చేసింది. మాధురి దూకుడు చూసి హౌస్‌లో ఉన్న మిగతా కంటెస్టెంట్లు ఆశ్చర్యపోయారు. కెప్టెన్ కళ్యాణ్ తో మాట్లాడిన దివ్య నిఖిత..  వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల తీరుపై మండిపడింది. వీళ్ళంతా మెంటల్ గాళ్లు అనుకుంటా..  ఏదో ఒకటి కనిపించేయాలి, కంటెంట్ ఇచ్చేయాలి అన్నట్లు ఉంది అంటూ మాధురి ఓవర్ యాక్షన్ చేస్తుందని తీవ్రంగా విమర్శించింది.

కర్రీ కోసం.. రచ్చ రచ్చ

సంజనతో గొడవ ముగియకముందే, కిచెన్‌లో దివ్య నిఖితతో మాధురి మరో వివాదానికి దిగింది. ఉదయం టిఫిన్‌గా చేసిన ఎగ్ దోశలతో పాటు, మాధురి కొద్దిగా కర్రీని కూడా తన ప్లేట్‌లో వేసుకుంది. నా పర్మిషన్ లేకుండా కామన్ ఫుడ్ తీసుకునే రైట్ ఈ ఇంట్లో ఎవరికీ లేదు. నన్ను అడగకుండా కర్రీ ఎందుకు వేసుకున్నారు? అంటూ ఫుడ్ మానిటర్ అయిన దివ్య, మాధురిని ప్రశ్నించింది. కొద్దిగానే వేసుకున్నాను, దానికి కూడా అడగాలా? అంటూ మాధురి అరవడంతో,..  ఒక్క సెకన్ అరవకండి అని దివ్య హెచ్చరించింది. దాంతో, ఏయ్.. ఏంటి వచ్చినప్పటి నుంచి గొడవపడాలని చూస్తున్నావా? అంటూ మాధురి మరింత సీరియస్ అయింది. ఫుడ్ మానిటర్‌గా దివ్యను మార్చాలని మాధురి డిమాండ్ చేయడంతో, హౌస్‌లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

పర్సనల్ బాండింగ్స్‌పై సెటైర్.. 

ఈ వాదనలో మాధురి వ్యక్తిగత విమర్శలకు దిగడం మరింత చర్చనీయాంశమైంది. పర్సనల్‌గా నాకు మీకు బాండింగ్ అవసరం లేదు అని దివ్య అనగానే, మాధురి రెచ్చిపోయింది. నాకు అస్సలు అవసరం లేదమ్మా. మీ బాండింగ్‌లు నాకెందుకు? వాట్ ఏ జోక్..  మేం బాండింగ్స్ కోసం వచ్చామనుకున్నారా? గేమ్ కోసం వచ్చామనుకున్నారా? అని అరిచింది. అనంతరం మాధురి...  నాన్న, నాన్న అనుకుంటూ...  అంటూ దివ్యను వెక్కిరిస్తున్నట్లు మాట్లాడింది. అంతేకాకుండా, ఎవరన్నారు అని దివ్య అనగానే.. పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నారట అని సామెత చెప్పి, పక్కనే ఉన్న తనూజ వైపు చూస్తూ పరోక్షంగా బాండింగ్స్ గురించి మరోసారి విమర్శించింది.

మొత్తం మీద, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ దివ్వెల మాధురి, తాను హౌస్‌లోకి 'బిగ్‌బాస్ 2.0' తీసుకురావడానికే వచ్చానని నిరూపించుకునే ప్రయత్నంలో ఉంది. ఆమె దూకుడు, అరుపులు, ఓవర్ యాక్షన్ ప్రేక్షకుల్లో భిన్నమైన అభిప్రాయాలకు దారితీశాయి. రాబోయే రోజుల్లో ఈ వైల్డ్ కార్డ్ ఫైర్ ఇంకెంత రచ్చ చేస్తుందో చూడాలి.