
తెలుగు బిగ్ బాస్ సీజన్ 7(bigg boss season 7)కు సంబంధించిన బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే తెలుగు 6 సీజన్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న బాగ్ బాస్ షో.. సీజన్ 7కు సంబంధించిన ప్రోమో ను రిలీజ్ చేశారు మేకర్స్. బిగ్ సీజన్ 6 కాస్త డిజప్పాయింట్ చేసిన నేపధ్యంలో.. సీజన్ 7 కోసం చాల కసరత్తులు చేశారట నిర్వాహకులు.
కంటెస్టెంట్స్, ఎపిసోడ్స్, గేమ్స్ వంటివి చాలా పక్కాగా ప్లాన్ చేశారట. ఎంటర్టైన్మెంట్ డోస్ ఏమాత్రం తగ్గకుండా ఈ సీజన్ ఉండనుందని సమాచారం. ఇక ఈ సీజన్ కు కూడా టాలీవుడ్ కింగ్ నాగార్జుననే(King nagarjuna) హోస్ట్ చేయనున్నాడట. గత సీజన్ తరువాత నాగార్జున బాగ్ బాస్ నుండి తప్పుకుంటున్నట్టు వార్తలు వైరల్ అయ్యాయి. కానీ అవన్నీ నిజం కాదని, ఈ సీజన్ కూడా నాగార్జుననే హోస్ట్ చేయనున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మరి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న బాగ్ బాస్ సీజన్ 7 ఏమేరకు ఆకట్టుకుంటుంది అనేది చూడాలి.