బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తుది దశకు చేరుకుంది. గ్రాండ్ ఫినాలేకు కేవలం ఒక వారం మాత్రమే మిగిలి ఉంది. ఈ 14వ వారం ఎలిమినేషన్ అత్యంత కీలకం కావడంతో హౌస్ లో కంటెస్టెంట్ మధ్య పోరు రసవత్తరంగా మారింది. ఎందుకంటే హౌస్‌లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో టాప్ 5 ఫైనలిస్టులను నిర్ణయించడానికి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరగనుంది. ఈ నేపథ్యంలో హౌస్ ఎవరు ఉంటారు.. ఎవరు బయటకు వస్తారు అన్న దానికిపై ఉత్కంఠ నెలకొంది.
ఓటింగ్ ట్రెండ్‌లో తనూజ దూకుడు
ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు సభ్యులు ఉన్నారు. వారిలో కళ్యాణ్ పడాల, తనూజ, ఇమ్మానుయేల్, డెమాన్ పవన్, భరణి, సంజన, సుమన్ శెట్టి ఉన్నారు. ఈ14వ వారం నామినేషన్లలో కళ్యాణ్ మినహా మిగిలిన ఆరుగురు ఉన్నారు. ఇప్పటి వరకు కు వచ్చిన వివిధ సోషల్ మీడియా పోల్స్, అనధికారిక ఓటింగ్ లెక్కల ప్రకారం.. తనూజ 26 శాతం ఓట్లతో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. కళ్యాణ్ నామినేషన్లలో లేకపోవడం ఆమెకు కలిసొచ్చింది. ఆతర్వాత స్థానంలో భరణి, పవన్, సంజన, ఇమ్మానుయేల్ , సుమన్ శెట్టి ఉన్నారు.
టైటిల్ రేసులో ఇమ్మానుయేల్!
మొదట్లో టైటిల్ రేసులో కళ్యాణ్ పడాల, తనూజ పోటాపోటీగా ఉన్నా, ఈ చివరి వారంలో ఇమ్మానుయేల్ తన ఆటతీరుతో , ముఖ్యంగా సంజనతో తన బాండింగ్ లో వచ్చిన మార్పుల కారణంగా దూసుకొచ్చాడు. అతనికి ఓటింగ్ కొంచెం తక్కువగా ఉన్నా, చివరి క్షణంలో అభిమానుల మద్దతు పెరిగినట్లు తెలుస్తోంది. అటు సంజనకు కూడా కాస్త ఓటింగ్ పెరిగినట్లు సమాచారం.
డబుల్ ఎలిమినేషన్ షాక్!
ఓటింగ్ ప్రకారం అతి తక్కువ ఓట్లు సాధించిన సుమన్ శెట్టి ఎలిమినేట్ కావడం దాదాపు ఖాయమైంది. ఆయన టాస్కుల్లో చురుకుగా లేకపోవడం, ఎంటర్టైన్మెంట్ అందించకపోవడం ఈ పతనానికి కారణమైంది. అయితే, బిగ్ బాస్ 9 లో ఊహించని షాక్‌లు ఇవ్వడం గత వారం రీతూ చౌదరి ఎలిమినేషన్ తో స్పష్టమైంది. తాజా లీకుల ప్రకారం, తక్కువ ఓటింగ్‌లో ఉన్న సుమన్ శెట్టితో పాటు, అనూహ్యంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన భరణి కూడా హౌస్ ను వీడినట్లుగా తెలుస్తోంది.
టాప్ 5 ఫైనలిస్టులు ఎవరు?
డబుల్ ఎలిమినేషన్ తర్వాత హౌస్‌లో ఐదుగురు కంటెస్టెంట్స్ మిగిలారు. వారిలో కళ్యాణ్ పడాల , తనూజ, ఇమ్మానుయేల్ , డెమాన్ పవన్ , సంజన ఉన్నారు. వీరి మధ్యనే టైటిల్ పోరు జరగనుంది. ఈ ఐదుగురు తమ మేకోవర్స్, ఓటు అప్పీల్స్ ద్వారా ఫినాలే వీక్‌ను రసవత్తరం చేయనున్నారు. విజేత ఎవరు అనే ఉత్కంఠ మరో వారంలో తేలిపోనుంది. మరి చివరికి బిగ్ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో చూడాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

