Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ హౌస్‌లో హీటెక్కిన గేమ్.. టాప్ 5 రేసులో ఊహించని ట్విస్ట్.. ఎవరు? ఎందుకు?

Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ హౌస్‌లో హీటెక్కిన గేమ్.. టాప్ 5 రేసులో ఊహించని ట్విస్ట్.. ఎవరు? ఎందుకు?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తుది అంకానికి చేరుకుంది. టైటిల్ కోసం కంటెస్టెంట్ మధ్య రసవత్తరంగా పోరు సాగుతోంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ప్రస్తుతం 12వ వారంలోకి అడుగుపెట్టింది. ఇక మిగిలి ఉన్నవి కేవలం మూడే వారాలు మాత్రమే. దీంతో హౌస్‌లో గేమ్ మరింత హీటెక్కింది. ప్రస్తుతం 9 మంది మాత్రమే ఫినాలే బెర్త్‌ల కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు.

హౌస్‌లో కంటెస్టెంట్స్

ప్రస్తుతం హౌస్ లో తనూజ, పవన్ కల్యాణ్ పడాల, డిమాన్ పవన్,  ఇమ్మాన్యుయేల్, భరణి, సుమన్ శెట్టి., రీతూ చౌదరి,దివ్య నికితా, సంజనా గల్రానీలు ఉన్నారు. అయితే ఈ తొమ్మిది మందిలో ఎవరు టాప్ 5లో నిలబడతారనే చర్చ సోషల్ మీడియాలో, అభిమాన వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.  ప్రస్తుతం ఉన్న ఓటింగ్ ట్రెండ్స్‌ను పరిశీలిస్తే, అనూహ్యంగా కామనర్లకు, సెలబ్రిటీలకు మధ్య తీవ్రమైన పోటీ కనిపిస్తోంది.

 టాప్ ప్లేస్‌లో తనూజ

సీజన్ మొదటి వారం నుంచీ అత్యధిక ఓటింగ్‌తో నిలకడగా డామినేట్ చేస్తూ వస్తున్న తనూజ ఇప్పటికీ టైటిల్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆమె సేఫ్ గేమ్ ఆడుతుందని, కొన్నిసార్లు ఎమోషనల్‌గా కనెక్ట్ కాలేకపోతుందని విమర్శలు ఉన్నాయి. అయినప్పటికీ హౌస్‌లో ఆమె ప్రదర్శించిన టాస్క్‌ల సామర్థ్యం, పట్టుదల ఆమెకు పెద్ద బలంగా మారాయి. ఈ సీజన్ టైటిల్ ఆమెకే దక్కుతుందని అభిమానులు బలంగా విశ్వసిస్తున్నారు.

పవన్ కల్యాణ్ దూకుడు

తనూజకు గట్టి పోటీ ఇస్తూ, రెండవ స్థానంలో కామనర్ పవన్ కల్యాణ్ పడాల నిలవడం ఈ సీజన్‌లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ గా నిలిచింది.. మొదట్లో ఇతనిపై 'గ్రూపిజం' ఆరోపణలు, తీవ్రమైన నెగెటివిటీ వచ్చినా, ఆ తర్వాత తన గేమ్ ప్లాన్ మార్చుకుని, టాస్కుల్లో అగ్రెసివ్‌గా దూసుకెళ్లడం అతనికి ఓట్లు పెరగడానికి కారణమైంది. కామనర్ కోటా నుంచి టైటిల్ రేసులో ఇతను కీలకంగా మారాడు.

 కమెడియన్ ఎమోషనల్ గేమ్

జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఆట, మాట తీరు పరంగా మెప్పిస్తున్నప్పటికీ, ఈ సీజన్‌లో అతను కేవలం ఒక్కసారి మాత్రమే నామినేషన్లలోకి రావడం అభిమానులకు కనెక్ట్ కాలేదనే చర్చ నడుస్తోంది. అదే అతనికి మైనస్‌గా మారి, టాప్-2కు దూరంగా ఉంచుతోంది. ఇక నాల్గవ స్థానంలో నిలకడగా ఆడుతున్న భరణి శంకర్ ఉండగా, ఐదో ప్లేసులో తన సహజ నటనతో అలరిస్తున్న సుమన్ శెట్టి కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఓటింగ్ ప్రకారం ఈ ఐదుగురు కంటెస్టెంట్లే టాప్-5లో ఉన్నట్లు సమాచారం.

డెంజర్ జోన్ లో ఇద్దరు

టాప్-5లో ఉంటారనుకున్న బలమైన కంటెస్టెంట్లు డిమాన్ పవన్ , రీతూ చౌదరి అనూహ్యంగా తక్కువ ఓట్లతో ఆరో, ఏడవ స్థానాల్లో కొనసాగుతున్నారు. హౌస్‌లో వీరి మధ్య నడుస్తున్న 'లవ్ ట్రాక్' కాకుండా..  వారి వ్యక్తిగత ఆటతీరుపై ప్రేక్షకులకు నమ్మకం సన్నగిల్లడం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇక సంజన గల్రానీ, దివ్యలు చివరి రెండు స్థానాల్లో కొనసాగుతూ ఎలిమినేషన్ ప్రమాదంలో ఉన్నారు. ఈ మిగిలిన మూడు వారాల్లో, కంటెస్టెంట్లు ఆడే ఫినాలే టికెట్ టాస్క్‌లు, ఎలిమినేషన్లు ఈ ఓటింగ్ ట్రెండ్‌ను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. తుది పోరు రసవత్తరంగా మారనుంది.