బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఊహించని మలుపులు తిరుగుతోంది. తుది దశకుల చేరుకున్న హౌస్ లో ప్రస్తుతం11 మంది సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నారు. ఇంకా ఆరు వారాల ఆట మాత్రమే ఉడటంతో మరింత ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ వారం హౌస్ లో నామినేషన్ ప్రక్రియ నిజంగా ఓ బిగ్ ట్విస్ట్ నిలిచింది. సోమవారం వచ్చిందంటే చాలు, హౌస్‌లో మొదలయ్యే నామినేషన్స్ ప్రక్రియ ఉంటుంది. ఈసారి నామినేషన్స్ ప్రక్రియ ఇంటి సభ్యులందరితో పాటు ప్రేక్షకులను కళ్లు బైర్లు కమ్మేలా చేసింది. ఈ వారం ఏకంగా కెప్టెన్‌తో సహా హౌస్‌లో ఉన్న పది మంది సభ్యులు నామినేట్ అయ్యారు. కేవలం ఒక్కరు మాత్రమే సేఫ్ అయ్యారు!
బురద నీళ్ల యుద్ధం..
ఇక ఆరువారాలు మాత్రమే ఉన్న ఈ కీలక సమయంలో బిగ్ బాస్ ఇచ్చిన ఈ మెగా ట్విస్ట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. నిన్నటి ఎపిసోడ్‌లో బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియను గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క హౌస్‌మేట్‌ను షవర్ కింద కూర్చోబెట్టి, నామినేట్ అయిన వారిపై బురద నీరు పడేలా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. మరింత ఒత్తిడి పెంచేందుకు, బిగ్ బాస్ ప్రతి సభ్యుడికి కేవలం ఐదు నిమిషాలు మాత్రమే గడువు ఇచ్చారు.
హౌస్ లో రణంరంగం..
నామినేషన్స్‌లో పెద్ద యుద్ధమే జరిగింది. హౌస్ లో కంటెస్టెంట్ల మధ్య రణంరంగాన్ని తలిపించింది. ఇమ్మానుయేల్ ముందుగా నిలకడైన ఆటగాడైన భరణిని నామినేట్ చేస్తూ, కెప్టెన్సీ టాస్క్‌లో తనుజ కోసం గివ్-అప్ చేయడం నచ్చలేదని స్పష్టం చేశాడు. ఆ తర్వాత, రీతూ ఏకంగా దివ్యపై మానిప్యులేషన్ ఆరోపణలు చేసింది. నువ్వు హౌస్‌లో ఒక గ్యాంగ్‌ను సృష్టించుకుని, అవసరం వచ్చినప్పుడు వాళ్ళను బాణాల్లా వదులుతావు. నీ ఆట ఓవర్ స్మార్ట్‌గా ఉంది అంటూ రీతూ వేసిన పాయింట్‌కు దివ్య చెప్పినట్లు చేయడానికి వాళ్లందరూ చిన్న పిల్లలా?" అంటూ దీటుగా బదులిచ్చింది.
గౌరవ్, సంజనను నామినేట్ చేస్తూ మీ ఆటలో పెర్ఫామెన్స్ లేదు. కేవలం ఎమోషనల్ డ్రామా, స్వార్థం మాత్రమే కనిపిస్తున్నాయి అని విమర్శించాడు. దీనికి కౌంటర్‌గా సంజన కూడా గౌరవ్‌నే నామినేట్ చేసింది. భరణి, దివ్యను నామినేట్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది, వీరిద్దరి మధ్య తీవ్ర వాదోపవాదాలు నడిచాయి.
మీ కళ్లు తెరిపిస్తాయో.. గేట్లు తెరుచుకుంటాయో..
సభ్యులందరూ వారి నామినేషన్స్ పూర్తి చేసి ప్రక్రియ ముగిసిందని భావించేలోగా, అసలు ట్విస్ట్ బయటపడింది. బిగ్ బాస్ నేరుగా రంగంలోకి దిగి హౌస్‌మేట్స్‌కు షాక్ ఇచ్చారు. మీ పట్ల, మీ ఆట పట్ల ప్రేక్షకులకు ఉన్న అభిప్రాయాన్ని మీరు ఎదుర్కోవాల్సిన సమయం ఇదే అని నేను నిర్ణయించాను. అందుకే, ఈ వారం ఇంటి నుంచి బయటికి పంపేందుకు అందరినీ నేరుగా నామినేట్ చేస్తున్నాను అని చెప్పారు. ఈ నామినేషన్ మీ కళ్లు తెరిపిస్తాయో, మీ కోసం బిగ్ బాస్ ఇంటి గేట్లు తెరుచుకుంటాయో, ఈ వారం మీరు చేసే యుద్ధమే నిర్ణయిస్తుందంటూ బిగ్ బాస్ షాక్ ఇచ్చారు.
10 మంది నామినేషన్..
బిగ్ బాస్ తీసుకున్న ఈ నిర్ణయంతో కెప్టెన్ అయిన ఇమ్మానుయేల్‌కు కూడా నామినేషన్ తప్పలేదు. అయితే, కెప్టెన్సీ ద్వారా వచ్చిన ఇమ్యూనిటీ దక్కించుకోవాలా వద్దా అనే నిర్ణయాన్ని హౌస్‌మేట్స్‌కు వదిలేశారు. భరణి ఒక్కడు మినహా, మిగిలిన తొమ్మిది మంది సభ్యులు ఇమ్మానుయేల్ సేఫ్ అవ్వాలని ఓటు వేశారు. దీంతో, ఇమ్మానుయేల్ మాత్రమే ఈ వారం నామినేషన్ నుంచి తప్పించుకుని సేఫ్ జోన్‌లో ఉన్నారు. భరణి, దివ్య, రీతూ, గౌరవ్, సంజన, కళ్యాణ్, నిఖిల్, సుమన్ శెట్టి, తనూజ, డీమాన్.. మొత్తం పది మంది సభ్యులు ఎలిమినేషన్ ప్రమాదంలో నిలిచారు. ఈ వారం ఆటలో మరింత ఉత్కంఠ, పోరాట పటిమ చూడబోతున్నాం...
