బిగ్ బాస్ సీజన్ 9 తుది అంకానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ ఫైనలిస్ట్ టికెట్ (Ticket to Finale) కోసం ఇంటి సభ్యుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ శుక్రవారం ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరో తేలిపోనుంది. ఈ తరుణంలో హౌస్ లో కంటెస్టెంట్ భరణి విశ్వరూపం చూపించడం హాట్ టాపిక్‌గా మారింది. టాస్క్‌లో అన్యాయం జరిగిందంటూ కోపంతో ఊగిపోయాడు. గతంలో జరిగిన కళ్యాణ్, డీమాన్ పవన్ 'చీటింగ్' బాగోతాన్ని బయటపెట్టి కలకలం సృష్టించాడు భరణి.
రీతూతో గొడవ, సంచాలక్‌పై ఫిర్యాదు
నిన్నటి ఎపిసోడ్‌లో రీతూ చౌదరి, భరణి శంకర్‌ల మధ్య 'రింగ్ మాస్టర్' అనే నాకౌట్ టాస్క్ జరిగింది. ఈ గేమ్ లో రీతూ గెలిచింది. కానీ చివరిలో నాకు డౌట్ ఉందంటూ తనూజ అనడంతో ఈ టాస్క్ సంచాలక్ సంజనపై బిగ్ బాస్ కు కంప్లైట్ చేశారు. సంచాలక్ తీసుకున్న నిర్ణయంపై సీరియస్ అయ్యాడు భరణి. అయితే లేటెస్ట్ టాస్క్ జంక్ యార్డ్‌లో ఉన్న ట్రయాంగిల్స్, స్క్వేర్స్, సర్కిల్స్ షేప్స్‌ని గుర్తించి వాటిని వాటిని ముందు ఎవరు పెడితే వాళ్లు గెలిచినట్టు. ఈ టాస్క్‌లో రీతూ, భరణి మధ్య జరిగింది. అయితే రీతూ గెలుపుపై భరణి అభ్యంతరం వ్యక్తం చేశాడు.
రీతూ పెట్టిన షేప్స్‌లో ఒకటి ట్రయాంగిల్ కాదని, దానికి మూడు భుజాలకు బదులుగా నాలుగు భుజాలు కనిపిస్తున్నాయని, అది రెక్టాంగిల్ అవుతుందని భరణి వాదించాడు. దీనిపై రీతూ "నా పేరు ఎందుకు తీస్తున్నారు? దాన్ని ట్రయాంగిల్ కాకుండా ఏమంటారు మరి?" అంటూ అరిచింది. "నేను సంచాలక్‌తో మాట్లాడుతున్నాను, నువ్వెందుకు మధ్యలో వస్తున్నావ్" అని భరణి అంతే గట్టిగా బదులిచ్చాడు. ఈ వివాదం కారణంగానే భరణి ఫైనలిస్ట్ రేసు నుంచి ఔట్ అయినట్లు సమాచారం.
కళ్యాణ్, డీమాన్‌లపై ఫైర్
టాస్క్‌లో అన్యాయం జరిగిందనే కోపంతో ఉన్న భరణి, తన ఆగ్రహాన్ని కళ్యాణ్ పడాల , డీమాన్ పవన్ వైపు మళ్లించాడు. గతంలో జరిగిన సంఘటనలను పరోక్షంగా ప్రస్తావిస్తూ, "ఎక్కడెక్కడ ఛీటింగ్ జరిగిందీ... ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందీ... ఎక్కడ షూ చూపిస్తే మనుషులను గుర్తుపట్టారో... మొత్తం వీడియోలు బయటకు వచ్చాయి. ఇప్పటికీ నేను నోరు మూసుకుని కూర్చున్నాను" అంటూ కళ్యాణ్, డీమాన్ పవన్‌లు ఆడిన చీటింగ్ గేమ్‌ని బయటపెట్టాడు.
దీంతో వెంటనే మధ్యలోకి దూసుకొచ్చిన కళ్యాణ్, "కన్ఫెషన్ రూంలో ఏం చూపించారో నాకు తెలుసు. డీమాన్‌కు ఆ విషయం తెలియదు. మీరు ఎవర్ని బ్లేమ్ చేస్తున్నారు, నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు?" అంటూ ఫైర్ అయ్యాడు. తన పేరు ప్రస్తావించకపోయినా, కళ్యాణ్ రియాక్ట్ అవ్వడం చూసి భరణి మరింత రెచ్చిపోయాడు. "నీ పేరు తెచ్చానా? నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావ్?" అంటూ కళ్యాణ్‌పైకి దూసుకువెళ్లాడు. మొత్తానికి, ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న భరణి, టికెట్ టు ఫినాలే రేసులో జరిగిన అన్యాయంపై తన విశ్వరూపాన్ని చూపించి హౌస్‌లో రచ్చ రచ్చ చేశాడు.
ఎవరు ముందున్నారు?
ప్రస్తుతానికి, ఫస్ట్ ఫైనలిస్ట్ రేసులో కళ్యాణ్ పడాల, రీతూ చౌదరి, ఇమ్మానుయేల్ మిగిలి ఉన్నట్లు తాజా సమాచారం. వీరి ముగ్గురిలో ఎవరు విజయం సాధిస్తారనేది శుక్రవారం ఎపిసోడ్‌లో తేలనుంది. భరణి చేసిన ఆరోపణలు, కళ్యాణ్ ఇచ్చిన కౌంటర్లతో ఈ వారం బిగ్ బాస్ ఎపిసోడ్ ఉత్కంఠగా మారనుంది. లేటెస్ట్ గా రిలీజైన ప్రోమో చూస్తే.. హౌస్ లో గట్టిగానే వార్ జరిగినట్లు తెలుస్తోంది.
