Bigg Boss Telugu 9: వైల్డ్ కార్డ్ ఎంట్రీ దివ్యకి భారీ రెమ్యూనరేషన్.. 9 వారాలకి సంపాదన ఎంతంటే?

Bigg Boss Telugu 9: వైల్డ్ కార్డ్ ఎంట్రీ దివ్యకి భారీ రెమ్యూనరేషన్.. 9 వారాలకి సంపాదన ఎంతంటే?

బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ చివరి దశకు చేరుకుంది. మరో మూడు వారాల్లో గ్రాండ్ ఫినాలే ఉంది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే ఉత్కంఠభరితమైన ఎలిమినేషన్ ప్రక్రియలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ దివ్య హౌస్‌ను వీడింది. ఆదివారం నాటి ఎపిసోడ్‌లో.. అతి తక్కువ ఓటింగ్ శాతం కారణంగా దివ్య ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. ఆమె హౌస్ లో సుమారు 65 రోజుల పాటు ఉంది. దీంతో దివ్య ఈ 9 వారాలకు రెమ్యూనరేషన్  ఎంత తీసుకుందన్న దానిపై సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చనడుస్తోంది.

వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఒక తుఫాన్

వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా నాల్గవ వారంలో బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన దివ్య తన ప్రత్యేక శైలితో, ఆట తీరుతో మొదటి రెండు వారాలు ప్రేక్షకులను ఆకట్టుకుంది. మెడికల్ స్టూడెంట్ అయినప్పటికీ, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఆమె హౌస్‌లో మంచి క్రేజ్ సంపాదించింది. ఆమె ఎంట్రీతో ఆట తీరు కాస్త మారింది.

 బాండింగ్‌లే బ్రేక్ వేశాయా?

దివ్య హౌస్‌లో కొనసాగిన 9 వారాల ప్రయాణంలో అత్యంత చర్చనీయాంశమైన అంశం భరణితో ఆమె బ్రదర్-సిస్టర్ బాండింగ్. భరణిని తండ్రిలా భావించిన తనుజతో మొదలైన దివ్య వైరం.. ఈ బాండింగ్‌తో మరింత పెరిగింది. దివ్య, భరణిపై చూపించిన పెత్తనం నేచర్ ప్రేక్షకులకు నచ్చలేదు. భరణి ఆటను దెబ్బతీసిందనే విమర్శలు సోషల్ మీడియాలో భారీగా వినిపించాయి. ఈ బాండింగ్‌ కారణంగా, ఆటపై సరైన దృష్టి పెట్టలేకపోయానని.. అదే తన ఎలిమినేషన్‌కు కారణమని దివ్య స్వయంగా అంగీకరించింది.

 9 వారాలకి రెమ్యూనరేషన్ ఎంతంటే?

దివ్య బిగ్ బాస్ హౌస్‌లో 9 వారాలు  కొనసాగింది. ఈ 9 వారాలకు ఆమెకు సెలబ్రిటీ స్థాయిలోనే పారితోషికం అందుకుందని టాక్ వినిపిస్తోంది. వారానికి రెమ్యూనరేషన్  సుమారు లక్షా 50 వేలు . ఈ లెక్కన ఆమె మొత్తం సంపాదన 9 వారాలకు గాను 13.5 లక్షల నుండి  రూ. 14 లక్షల వరకు లభించిందని సమాచారం. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా వచ్చి, దాదాపు రెండు నెలలకు పైగా హౌస్‌లో ఉండి, ఇంత భారీ మొత్తంలో సంపాదించడం దివ్య కెరీర్‌కు ఖచ్చితంగా పెద్ద బూస్ట్ అనే చెప్పాలి.

 గతవారం ట్విస్ట్.. ఈ వారం అవుట్

నిజానికి, దివ్య గత వారమే ఎలిమినేట్ కావాల్సి ఉంది. కానీ, ఆమె -తనుజల గొడవ వల్ల టీఆర్పీ రేటింగ్ పెరిగిందని టాక్. దీంతో బిగ్ బాస్ వ్యూహాత్మకంగా ఎమ్మాన్యుయేల్ 'పవర్ అస్త్ర' ను ఉపయోగించి ఆ వారం ఎలిమినేషన్‌ను రద్దు చేయించారు. అయితే, ఈ వారం డేంజర్ జోన్‌లో ఉన్న దివ్య, సుమన్ శెట్టిలలో ఉత్కంఠభరితమైన 'అగ్నిపర్వతం టాస్క్' ద్వారా దివ్య ఎలిమినేషన్‌ను అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతానికి హౌస్‌లో తనుజ, కల్యాణ్, ఎమ్మాన్యుయేల్, రీతూ, సంజన, సుమన్ శెట్టి, భరణి, పవన్ వంటి ఎనిమిది మంది కంటెస్టెంట్‌లు మాత్రమే మిగిలారు. ఫినాలే రేసు మరింత రసవత్తరంగా మారింది.