తెలుగు బిగ్ బాస్ 9వ సీజన్ 'డబుల్ హౌస్, డబుల్ ధమాకా' కాన్సెప్ట్‌తో రసవత్తరంగా సాగుతోంది. ఈసారి షో చరిత్రలోనే తొలిసారిగా కామనర్స్ పాల్గొనడం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆట ఉత్కంఠభరితంగా మారుతున్న సమయంలో, హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అడుగుపెట్టడంతో ఇంట్లో ఒక్కసారిగా ఫైర్ స్టార్మ్ 2.0 మొదలైంది. వీరి రాకతో పాత గ్రూపులు చెదిరిపోయి, కొత్త కూటములు, కొత్త శత్రుత్వాలు ఏర్పడ్డాయి.
ఆరుగురు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ!
ఈ సీజన్‌లో మొత్తం ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టారు. వారంతా బలమైన పోటీదారులుగా కనిపించారు. వారిలో గౌరవ్ గుప్తా, దివ్వెల మాధురి , ఆయేషా జీనత్, శ్రీనివాస సాయి, నిఖిల్ నాయర్, రమ్య మోక్ష ఉన్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్‌మేట్స్‌కు గట్టి షాకివ్వడంతో.. ఆట అంచనాలు పూర్తిగా మరిపోయాయి. వచ్చిన కొత్తలో వీరికి బిగ్ బాస్ ఇచ్చిన ప్రత్యేక పవర్‌తో నామినేషన్స్ ప్రక్రియ కూడా మరింత వేడెక్కింది. లేటెస్ట్ గా జరిగిన నామినేషన్ ప్రక్రియలో ఎనిమిది మంది కంటెస్టెంట్లు - తనుజ , రాము రాథోడ్, సంజన , కళ్యాణ్ , రితు చౌదరి, శ్రీనివాస సాయి, దివ్య , రమ్య మోక్ష - డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఈ తరుణంలో తమ ఆట తీరును మెరుగుపరుచుకోవాలన్న ఒత్తిడి ప్రతి కంటెస్టెంట్ పైనా పెరిగింది.
ఆయేషా జీనత్ సడెన్ ఎగ్జిట్!
అయితే, ఈ డ్రామా మధ్యలో ఒక ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా కేవలం పది రోజుల క్రితం హౌస్‌లోకి అడుగుపెట్టిన సీరియల్ నటి ఆయేషా జీనత్, ఇంటి నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. బిగ్ బాస్ తెలుగు అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. తమిళ బిగ్ బాస్ 6వ సీజన్‌లో పాల్గొని, తన ఫైర్ బ్రాండ్ ఇమేజ్‌తో పాపులర్ అయిన ఆయేషా, తెలుగులో కూడా తన ఉనికిని చాటుకోవడం మొదలుపెట్టింది. ఇంటి సభ్యులతో ఆమె కొత్త బంధాలను ఏర్పరచుకుంటున్న సమయంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.
ఆరోగ్య సమస్యలే కారణమా?
ఆయేషా హౌస్ నుంచి బయటకు రావడానికి గల కారణం ఆరోగ్య సమస్యలుగా తెలుస్తోంది. ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి ఆమె ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే, ఆమె కేవలం పది రోజుల్లోనే షోను వీడటం, అది కూడా వైద్య కారణాలతో అని తెలియడంతో... ఆయేషా తిరిగి షోలోకి వస్తుందా? అనే ప్రశ్న అభిమానుల్లో మొదలైంది. ఇది కేవలం తాత్కాలిక విరామమేనా లేక పూర్తి స్థాయి నిష్క్రమణా అనేది తెలియాల్సి ఉంది. 47వ రోజు సెకండ్ ప్రోమోలో కూడా ఆయేషా కనించలేదు. దీనిని బట్టి ఆమె బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై బిగ్ బాస్ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మొత్తానికి, ఆయేషా జీనత్ హఠాత్తుగా వెళ్లిపోవడం ఈ సీజన్‌లోని డ్రామాను మరింత పెంచింది. మరి రాబోయే రోజుల్లో బిగ్ బాస్ హౌస్‌లో ఎలాంటి అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి!
