
బిగ్ బాస్ సీజన్ 8 (Bigg Boss 8) రాబోతుంది. 'అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్..ఒక్కసారి కమిట్ అయితే ఇక్కడ అన్ లిమిటెడ్..లిమిటే లేదు' అంటూ వచ్చేస్తోంది.ఈసారి లిమిటే లేకుండా..ఎంటర్టైన్మెంట్ ఇస్తామని నాగ్ ఆడియన్స్ కు హామీ ఇచ్చేశాడు. ఇటీవలే బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ లాంచ్ సెప్టెంబర్ 1 నుంచి షురూ అని స్టార్ మా ఛానెల్,డిస్నీ+ హాట్‌స్టార్ ప్రకటించాయి.
ప్రస్తుతం సీజన్ 8 కి హోస్ట్‌గా ‘కింగ్’ నాగార్జున తన రెమ్యునరేషన్ భారీగా పెంచేసినట్లూ తెలుస్తోంది. గత సీజన్ కంటే ఈసారి అది రెట్టింపు కావడం గమనార్హం. అయితే ఈ కొత్త సీజన్లో కంటెస్టెంట్లను రెండు గ్రూపులుగా విభజించబోతున్నట్లు వస్తున్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి.
Also Read:-శ్వాగానిక వంశానికి స్వాగతం..స్వాగ్తో కడుపుబ్బా నవ్విస్తున్న శ్రీ విష్ణు
అంతేకాకుండా కంటెస్టెంట్ల రెమ్యునరేషన్, ఫైనల్ విన్నర్స్‌కు అందే పారితోషికం ఎంత అనేది ప్రస్తుతం ఆడియన్స్ లో క్యూరియాసిటీగా మారింది. బిగ్ బాస్ ద్వారా లైమ్ లైట్‌లో లేని సెలబ్రిటీలు, సాధారణ వ్యక్తుల దశ మారిపోతుందా? ఎందుకంటే, ఈ షోలో సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు కంటెస్టెంట్స్‌గా పాల్గొంటారన్న విషయం తెలిసిందే. మరి సాధారణ వ్యక్తులు ఈ షోకి వచ్చాక..బిగ్ బాస్ హౌస్ ఇచ్చే పారితోషకంతో వారి దశ మారిపోతుందా? అసలు రెమ్యునరేషన్ ఏ రేంజ్లో ఇస్తారు? ఆ వివరాలు చూద్దాం.
బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ఇచ్చే రెమ్యునరేషన్ వారి సోషల్ మీడియాలో ఫేమ్, బయట వారికుండే పాపులారిటీని బట్టి అంచనా వేస్తారు. ఈ మేరకు మన తెలుగు రాష్ట్రాల్లో స్టార్ సెలబ్రిటీ స్థాయి ఉన్న కంటెస్టెంట్స్ కి ఒక వారానికి లక్షల్లో పారితోషికం ఇస్తారు. అంటే,అది రూ. 2నుంచి 5 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే..గత సీజన్ (బిగ్ బాస్ 7లో) పాల్గొన్న హీరో శివాజీకి వారానికి రూ.4.5 లక్షలురెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం. ఎందుకంటే, హీరో శివాజీ ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అలాగే, రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశాడు. అందుకే అతనికి ఆ స్థాయిలో పారితోషకం అందింది.
ఇకపోతే, ఇక సాధారణ యూట్యూబర్స్, లైమ్ లైట్‌లో లేని సెలబ్రిటీలకు వారి వారి ఫేమ్ ని బట్టి వేలల్లో ఇస్తారు. ఉదాహరణకు చెప్పాలంటే..రైతు బిడ్డగా, కామన్ మ్యాన్‌గా వచ్చిన పల్లవి ప్రశాంత్‌కు ఒక వారానికి రూ.1లక్ష లోపు ఇచ్చినట్లు టాక్ వినిపించింది. ఇకపోతే వచ్చే ప్రతి కంటెస్టెంట్ ఎన్ని రోజులు ఉంటాడనేది వారు ఆడే ఆటను బట్టి ఉంటుంది. ఇక బిగ్ బాస్ షోలో పాల్గొనడం వల్ల..బయటికి వచ్చాక దశ మారిపోతుందా అంటే..అది ఆ సెలబ్రిటీపైనే ఆధారపడి ఉంటుంది.
ఎందుకంటే, కొంతమంది మంచి కథలను ఎంచుకుంటూ సినిమాల్లో రాణిస్తారు. ఇంకొంతమంది ప్రతిదీ హడావిడిగా మొదలు పెట్టి మధ్యలోనే ముగించేస్తారు. వారిలో అరియానా గ్లోరి, సయ్యద్ సోహైల్, వీజే సన్నీ, రాహుల్ సిప్లిగంజ్, ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. వీళ్లందరిలో బిగ్ బాస్ ద్వారా రాహుల్ సిప్లిగంజ్‌కు చాలా ఫేమ్ వచ్చింది. వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. అందులో RRR మూవీతో నాటు నాటు పాట పాడి ఆస్కార్ స్థాయికి వెళ్లి..సాధించాడు. ఇకపోతే హీరో శివాజీ ప్రస్తుతం వరుస సినిమాలో నటిస్తున్నాడు. మరి చూడాలి..ఈ సారి ఎవరు ఏ స్థాయికి వెళుతారో!
బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ రూ. 50 లక్షలు. అయినప్పటికీ వాటిలో నుంచి ప్రిన్స్ యావర్ రూ. 15 లక్షలు టాప్ 4 కంటెస్టెంట్ గా తీసుకెళ్లిపోయాడు. దీంతో ప్రైజ్ మనీ రూ. 35 లక్షలకు తగ్గింది. అలాగే జోయాలుకాస్ వారు ఇచ్చే నగల విలువ రూ. 15 లక్షలు. వీటితోపాటు బ్రీజా కారు విలువ సుమారు రూ. 12 లక్షలు అని సమాచారం. ఇవన్ని కలుపుకుంటే పల్లవి ప్రశాంత్‌కు వచ్చింది రూ. 62 లక్షలు వచ్చినట్లు టాక్.