
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు(SreeVishnu) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవల సామజవరగమన (Samajavaragamana) సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న శ్రీవిష్ణు..ఆ తర్వాత ఓం భీమ్ బుష్(Om Bheem Bush) అనే కామెడీ ఎంటర్టైన్మెంట్ తో అలరించాడు. ప్రస్తుతం రాజ రాజ చోర సినిమాతో తనకు మంచి హిట్ అందించిన దర్శకుడు హసిత్ గోలితో స్వాగ్ (Swag) అనే మూవీ చేస్తున్నాడు.
తాజాగా స్వాగ్ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. రెండు నిమిషాలకుపైగా ఉన్న ఈ టీజర్ మొదటి నుంచీ చివరి వరకూ నవ్విస్తూనే ఉంది. శ్రీ విష్ణు తన స్వాగ్, కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు. ఈ సినిమాలో శ్రీ విష్ణు 'సింగ, భవభూతి, యయాతి, కింగ్ భవభూతి' అనే నాలుగు భిన్నమైన పాత్రల్లో నటిస్తుండటం విశేషం.
Also Read:- విజయాల కంటే..పరాజయాల వల్లే ఎక్కువ నేర్చుకున్నా
నాలుగు పాత్రల్లో నాలుగు డిఫరెంట్ షేడ్స్, భిన్నమైన డైలాగ్ డెలివరీతో శ్రీ విష్ణు ఆకట్టుకున్నాడు. రెండు కాలాల మధ్య సాగే ఈ సినిమా అసలు కథ ఏంటి? దీని ఎండింగ్ ఎలా ఉంటుందన్నది మూవీ చూస్తేనే తెలుస్తుంది. ఇక కథ చివర్లో ఇది మగవాడిది, శ్వాగణిక వంశానిది అని శ్రీవిష్ణు చెప్పిన డైలాగ్ కూడా చాలా బాగుంది. దీంతో ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతున్నట్టు క్లియర్ గా అర్థమవుతోంది.
స్వాగ్ టీజర్ ఎలా ఉందంటే?
స్వాగ్ టీజర్ కొన్నివందల ఏళ్ల కిందట అసలు మగ బిడ్డ పుడితే చంపేసే రోజుల్లో షురూ అయింది. అప్పట్లో వింజమర వంశానికి రాణిగా ఉన్న రుక్మిణీ దేవి (రీతూ వర్మ).. మగవాళ్లపై ద్వేషంతో తన వంశంలో మగబిడ్డ పుట్టకూడదని అనుకుంటుంది. ఒకవేళ పుట్టినా చంపేస్తానంటుంది. ఆ సమయంలో ఈ వంశంలో ఇక మగ పిల్లాడు పుట్టడు అంటూ శ్రీ విష్ణు ఎంట్రీ ఇస్తాడు. కట్ చేస్తే ఈ కాలంలో ఆడవాళ్లతో ఆడుకునే వ్యక్తిగా శ్రీ విష్ణు కనిపిస్తాడు. ఇక గత జన్మలో మగ వాళ్లను ద్వేషించే రాణిగా ఉన్న రీతూ వర్మ..ఇప్పుడు అతనికి బానిసగా మారిపోతుంది.ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న మూవీగా టీజర్ చూస్తే తెలుస్తోంది.
ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో శ్రీవిష్ణు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.