Krithi Shetty: విజయాల కంటే..పరాజయాల వల్లే ఎక్కువ నేర్చుకున్నా..కృతిశెట్టి ఎమోషనల్

Krithi Shetty: విజయాల కంటే..పరాజయాల వల్లే ఎక్కువ నేర్చుకున్నా..కృతిశెట్టి ఎమోషనల్

తొలిచిత్రం ‘ఉప్పెన’తో సక్సెస్‌‌ అందుకుని టాలీవుడ్‌‌లో ఓవర్ నైట్ స్టార్‌‌‌‌డమ్‌‌ను అందుకుంది కృతి శెట్టి. ఈ ఒక్క సినిమాతో యూత్‌‌కు ఫేవరేట్‌‌ హీరోయిన్‌‌ అయిన కృతి.. బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంది. కానీ అవేవి ఆమెకు ఆశించిన స్థాయిలో విజయాలను అందించలేకపోయాయి. దీంతో కోలీవుడ్‌‌ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి  అక్కడ వరుస సినిమాలు చేస్తోంది. మరోవైపు మలయాళంలోనూ ఓ సినిమా చేస్తోంది.

ఇక తన కెరీర్‌‌‌‌ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎమోషనల్ అయింది కృతి. ‘నా తొలిచిత్రం ‘ఉప్పెన’ హిట్ అయింది. కానీ ఒక సెక్షన్ జనాలు నాకు ఫ్లాప్ వస్తే వేలెత్తి చూపించాలని ఎదురు చూశారు. అయితే నేను హిట్, ఫ్లాప్ రెండింటినీ ఒకేలా తీసుకున్నా. నా ఫస్ట్ మూవీ సక్సెస్‌‌లో మొత్తం క్రెడిట్ తీసుకోలేదు. అలాగే ఫ్లాప్‌‌లోనూ పూర్తి క్రెడిట్ తీసుకోను’ అని చెప్పింది.

విజయాల కంటే పరాజయాల వల్లే ఎక్కువ విషయాలు నేర్చుకున్నానని, తన సినిమాలు ఎందుకు ఆడలేదనే అనాలసిస్ వల్ల విమర్శలను ఎదుర్కొని నిలబడగలిగానని చెప్పిందామె. అయితే తనకు ప్లాప్ రావాలని అంతగా కోరుకున్న ఆ వ్యక్తులు ఎవరో మాత్రం కృతి రివీల్ చేయలేదు. 

ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్స్ అయ్యాయి.ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం, కస్టడీ సినిమాలు చేసింది. ఆతర్వాత ఈ అమ్మడు శర్వానంద్ తో కలిసి మనమే అనే సినిమా చేసింది. ఈ సినిమా కాస్త పర్లేదు అనిపించుకుంది. వరుస ఫ్లాప్స్ పలకరించడంతో ఈ చిన్నదానికి అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమా చేసింది. తాజాగా కృతి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.