
వైవీఎస్ చౌదరి దర్శకుడిగా ఆయన భార్య యలమంచిలి గీత ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నందమూరి జానకిరామ్ కొడుకు నందమూరి తారక రామారావును, కూచిపూడి డ్యాన్సర్ వీణారావును హీరోహీరోయిన్స్‌గా పరిచయం చేస్తున్నారు.
గురువారం ఆగస్ట్ 29న నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ ‘1980 బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ ఇది. తెలుగు భాష, సంస్కృతి, తెలుగు జాతి నేపథ్యంలో ఉంటుంది. మెసేజ్‌తో పాటు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ చక్కగా కుదిరాయి’ అని చెప్పారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈ వేదికపై గీత రచయిత చంద్రబోస్‌ను సత్కరించారు.
తెలుగు భాష, సంస్కృతుల గొప్పతనం గురించి మాట్లాడిన రచయితలు సాయి మాధవ్ బుర్రా, చంద్రబోస్... తెలుగు భాష ప్రాముఖ్యతను గుర్తించి తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా తెలుగు నేర్పించాలని కోరారు. నిర్మాత యలమంచిలి గీత, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ అత్తిలి కార్యక్రమంలో పాల్గొన్నారు.