ప్రముఖ స్టాండప్ కమెడియన్, బిగ్‌బాస్ విన్నర్ మునావర్ ఫరూఖీ (Munawar Faruqui)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ముంబయిలోని ఫోర్ట్ ఏరియాలో నడుపుతోన్న ఓ హుక్కా పార్లర్‌లో మంగళవారం రాత్రి పోలీసులు సోదాలు నిర్వహించారు. బుధవారం తెల్లవారుజాము 5 గంటల వరకు ఈ సోదాలలో కొంత నగదు, హుక్కా పాట్స్‌ను సీజ్ చేశారు. ఈ దాడుల్లో మునావర్ ఫరూఖీ తోపాటు మరికొందరు హుక్కా తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇదే విషయం గురించి అధికారులు మాట్లాడుతూ.. ముంబయి హుక్కా పార్లర్‌లో జరిగిన సోదాల్లో మునావర్ ఫరూఖీ తోపాటు మరికొందరు హుక్కా తీసుకున్నట్లు మేము గుర్తించాము. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మా వద్ద ఉన్నాయి. ఈ ఘటనలో మొత్తం 14 మందిని అదుపులోకి తీసుకున్నామని, వారికి నోటీసులు ఇచ్చి విడుదల చేశామని.. అని తెలిపారు.
