V6 News

Game Changer: జరగండి.. గేమ్ ఛేంజర్ సాంగ్ వచ్చేసింది.. చరణ్ కుమ్మేశాడుగా!

Game Changer: జరగండి.. గేమ్ ఛేంజర్ సాంగ్ వచ్చేసింది.. చరణ్ కుమ్మేశాడుగా!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్(Game Changer). స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ(Kiara advani) హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ హిట్ తరువాత రామ్ చరణ్ అది కూడా శంకర్ డైరెక్షన్ లో మూవీ చేస్తుండటంతో.. గేమ్ ఛేంజర్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే చాలా కాలంగా ఈ మూవీ అప్డేట్స్ మెగా ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. 

తాజాగా వాళ్లందరికీ సర్ప్రైజ్ ఇస్తూ ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ విడుదల చేశారు మేకర్స్. మార్చ్ 27 రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా.. జరగండి.. జరగండి.. అనే పాటను విడుదల చేశారు. తమన్ సంగీతం అందించిన ఈ పాట నెక్స్ట్ లెవల్లో ఉంది. ఇక శంకర్ విజువల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండా ఈ పాటలో విజువల్స్ ఉన్నాయి. రచయిత అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటను.. డాలర్ మెహందీ, సునిది చౌహాన్ పాడారు. స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ఈ సాంగ్ కొరియోగ్రఫీ చేయడం మరో విశేషం. ఎంతో కలర్ ఫుల్ గా, గ్రాండియర్ గా  ఉన్న ఈ పాట సినిమాకె హైలెట్ కానుందని టాక్. ఇక మొత్తంగా చరణ్ బర్త్ డే కి వచ్చిన ఈ గిఫ్ట్ మెగా అభిమానుల్లో ఖుషీ నింపింది. అలాగే సినిమాపై అంచనాలను పెంచేసింది.