గవర్నర్ రికార్డో రాసెల్ రాజీనామా చేయాలని డిమాండ్చేస్తూ రోడ్డెక్కిన పోర్టొరికో వాసులు వీళ్లు.. పోర్టొరికో ద్వీపం చరిత్రలో జరిగిన భారీ ఆందోళనలో ఇదొకటట. ఇంత భారీ ఉద్యమానికి కారణమేంటంటే.. స్త్రీలంటే ద్వేషపూరితంగా, స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించేలా గవర్నర్రికార్డో తన కింది ఉద్యోగులకు పంపిన మెసేజ్లే ! వందల పేజీల కొద్దీ పంపిన ఈ మెసేజ్లు ఇటీవల లీకయ్యాయి.
దీంతో ప్రజల్లో రికార్డో పట్ల విముఖత ఏర్పడింది. ప్రజలు ఆందోళన చేస్తున్నా, ప్రెసిడెంట్ ట్రంప్ దిగిపొమ్మని కోరినా.. రికార్డో మాత్రం ససేమిరా అంటున్నాడు. అవును, తప్పు చేశాను నిజమే. దానికి క్షమాపణ చెప్పాను. పదవికి రాజీనామా చేసే సమస్యే లేదు. ఇంకో ఏడాదిన్నర పాటు పదవిలోనే ఉంటానని రికార్డో చెప్పారు.
