ప్రపంచంలోనే పెద్ద టీ షర్ట్.. వంద మందైనా పడతారేమో..

ప్రపంచంలోనే పెద్ద టీ షర్ట్.. వంద మందైనా పడతారేమో..

రొమేనియా ప్రపంచంలోనే అతి పెద్ద టీ-షర్టును తయారు చేసి రికార్డు సృష్టించింది. రగ్బీ పిచ్ కంటే పెద్దగా ఉన్న ఈ టీ షర్ట్ .. ప్రపంచ రికార్డు నెలకొల్పింది. దీని పొడవు 108.96 మీ (357.48 ft), వెడెల్పు 73.48 మీ(241.08 ft). 120 మంది కంటే ఎక్కువమంది వాలంటీర్లు కలిసి ఈ చొక్కాను తయారు చేశారు. అయితే ఈ టీ షర్టును ఓపెన్ చేయడానికే తమకు ఒక రోజు మొత్తం పట్టిందని రికార్డ్ కీపింగ్ సంస్థ తెలిపింది.

ఈ టీ-షర్టుకున్న మరో ప్రత్యేకతేంటంటే పారేసిన ప్లాస్టిక్ బాటిళ్లను రీసైక్లింగ్ చేసి దీన్ని తయారు చేశారట. రీసైక్లింగ్ పట్ల అందరికీ అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారట. దీన్ని తయారు చేయడానికి దాదాపు 5లక్షల రీ సైకిల్ ప్లాస్టిక్ సీసాలు సేకరించినట్టు సమాచారం. వీటిని సేకరించేందుకు మూడు వారాలు పట్టిందని, ఇక ఫ్యాబ్రిక్ లో కుట్టడానికి నెల సమయం పట్టిందని నిర్వాహకులు తెలిపారు. ఈ టీ షర్ట్ పై రొమేనియన్  జాతీయ జెండా, రగ్బీ జట్టు అధికార జెర్సీ ఉంది.

https://twitter.com/GWR/status/1661313086685614082