Bihar: కుక్కపై వ్యక్తి అత్యాచారం.. పోలీస్ కేసు

Bihar: కుక్కపై వ్యక్తి అత్యాచారం.. పోలీస్ కేసు

బీహార్ రాష్ట్రం అనగానే నేరాలు.. ఘోరాలు అనే ఆలోచన వస్తుంది.. అంతకు మించి కూడా అక్కడి మనుషుల ప్రవర్తన ఉంటుందనేది ఈ ఘటనతో నిరూపితం అయ్యింది. 2023, మార్చి 8వ తేదీ హోలీ పండుగ రోజు.. బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా సిటీలో ఓ వీధి కుక్కపై.. ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు.. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఇన్సిడెంట్ సంచలనంగా మారింది. 

పాట్నాలోని పుల్వారీ షరీఫ్ లోని ఫైసల్ కాలనీలోని ఓ వ్యక్తి వీధిలోని.. ఓ వీధి కుక్కపై అత్యాచారం చేశాడు. నడి బజారులో అర్థరాత్రి జరిగిన ఈ ఘటన.. కాలనీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై కాలనీ వాసులు పుల్వారీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో భూరి ఫౌండేషన్ అనే జంతు సంస్థ ప్రతినిధులు కంప్లయింట్ ఫైల్ చేశారు.  దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఐపీసీతోపాటు జంతు చట్టం కింద చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కంప్లయింట్ వచ్చిందని.. కుక్కపై అత్యాచారం చేసిన వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేస్తామని తెలిపారు అసిస్టెంట్ సూపరింటెండ్ ఆఫ్ పోలీస్. 

ఇలాంటి అసహజమై, హేయమైన ఘటనలు దేశంలో జరగటం ఇదే ఫస్ట్ టైం కాదని.. గతంలోనూ జరిగాయంటున్నారు బీహార్ పోలీసులు. గతంలో ఢిల్లీలోని ఇంద్రపురి కాలనీ జేజే కాలనీలో ఇలాంటి ఘటనే జరిగిందని.. కుక్కపై అత్యాచారం చేసిన సతీష్ అనే వ్యక్తిని పట్టుకున్నట్లు వెల్లడించారు బీహార్ పోలీసులు. ప్రస్తుతం బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన ఘటనను సీరియస్ గా తీసుకుని విచారణ చేసి.. సంబంధిత వ్యక్తిని అరెస్ట్ చేస్తామని తెలిపారు పోలీసులు.