ప్రపంచం మొత్తం జెన్ జీ ఫీవర్ నడుస్తుంది.. ఈ తరం కుర్రోళ్లు అంటేనే వణుకు పుట్టిస్తున్నారు.. మన దేశం విషయానికి వస్తే నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జెన్ జీ చేస్తున్న ఉద్యమం తీవ్రంగా మారుతుంది. లాఠీఛార్జీలు, నిర్బంధాలను లెక్క చేయకుండా జెన్ జీ చేస్తున్న పోరాటం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది. ఇదే సమయంలో.. దేశంలోని జెన్ జీ వర్సెస్ బీహారీ జెన్ జీ అంటూ కొన్ని వీడియో దుమ్మురేపుతున్నాయి సోషల్ మీడియాలో.. దేశంలో జెన్ జీకి.. బీహారీ జెన్ జీలకు తేడా ఏంటీ.. పోరాటాల్లో జెన్ జీలకు.. బీహారీ జెన్ జీలు ఎలా వ్యవహరిస్తారో తెలుసుకుందామా..
జెన్ జీ Vs బీహారీ జెన్ జీ :
ఏటికి ఎదురీదటం అనే మాట తెలుసు కదా. అలా ఉన్నారు బీహార్ జెన్ జీ బ్యాచ్. ప్రొటెస్ట్ సందర్భంగా పోలీసులు లాఠీ ఛార్జీ చేస్తుంటే అందరూ భయంతో పరిగెడుతుంటే బీహారీలు మాత్రం ఎదురెళ్లి పోలీసులకే చుక్కలు చూపిస్తున్నారు. బీహార్ జెన్ జీ డేరింగ్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.
రివర్స్ లాఠీఛార్జీ:
ఢిల్లీ జంతర్ మంతర్ లో పోలీసుల లాఠీఛార్జీలతో యువత అంతా పరుగులు తీశారు..
బీహారీ జెన్ జీ ఏం చేశారో తెలుసా.. పోలీసులపై తిరిగబడి.. పోలీసుల లాఠీలు లాక్కుని.. పోలీసుల లాఠీలతో పోలీసులను కొట్టారు.. దట్స్ బీహారీ జెన్ జీ..
వాటర్ కెనాన్స్ లో డ్యాన్సులు:
ఆందోళనకారులపై పోలీసులు వాటర్ కెనాన్స్ ప్రయోగించారు. ఆ ధాటికి అందరూ చెల్లాచెదురు అయ్యారు..
బీహారీ జెన్ జీ ఏం చేశారో తెలుసా.. పోలీసులు వాటర్ కెనాన్స్ ప్రయోగిస్తే.. రెయిన్ డాన్స్ చేశారు.. వర్షం పాటలు పాడుకున్నారు.. దట్స్ బీహార్ జెన్ జీ..
బారికేడ్లను తోసుకుంటూ..
ఛలో పార్లమెంట్ సందర్భంగా విద్యార్థులను అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేస్తే.. అందరూ బారికేడ్ల నుంచి దూరంగా వేరే మార్గంలో వెళ్లేందుకు ప్రయత్నించారు. అదే టైమ్ లో జెన్ జీ బీహారీలు బారికేడ్లను తోసుకుని ముందుకెళ్లటం చూసి పోలీసులు షాకయ్యారు. ఎలాంటి భయాలు లేకుండా బారికేడ్లతో సరదాగా ఆటలు ఆడటం వీడియోలో చూడవచ్చు.
►ALSO READ | విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు.. NEET వివాదంపై ఇర్ఫాన్, మంజ్రేకర్ ఫైర్
పోలీసు వాహనాలు గుల్ల గుల్ల..
పోలీసు వాహనాలను చూసి పరిగెట్టే పరిస్థితుల్లో.. అవేవో ఆటబొమ్మల్లాగా ఊపి ఊపి.. వాటిని గుల్ల గుల్ల చేశారు బీహార్ జెన్ జీలు.
టియర్ గ్యాస్ ఫైట్..
పోలీసులు విసిరే టియర్ గ్యాస్ తో కళ్లు మండుతుంటే అందరూ పరుగులు తీయటం కామన్. కానీ బిహార్ బ్యాచ్ మాత్రం.. ఆ టియర్ గ్యాస్ బాంబులను తీసుకుని పోలీసులకే రివర్స్ లో వేస్తున్నారు. దీంతో ఇదేం ఖర్మరా బాబూ అంటూ పోలీసులే పరుగు తీసే పరిస్థితి.
