భద్రాచలంలో ఘోరం: బైకులు ఢికొన్న ఘటనలో గొడవ.. వ్యక్తి దారుణ హత్య 

భద్రాచలంలో ఘోరం: బైకులు ఢికొన్న ఘటనలో గొడవ.. వ్యక్తి దారుణ హత్య 

భద్రాచలంలో దారుణం జరిగింది. రెండు బైకులు ఢీకొన్న ఘటనలో మొదలైన గొడవ ఓ వ్యక్తి దారుణ హత్యకు దారి తీసింది. గురువారం ( డిసెంబర్ 18 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. పాల్వంచకు చెందిన సజ్జ రవి రాజుపేటలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి భద్రాచలం వైపు వస్తుండగా.. రెండు బైకులు ఢీకొనడంతో గొడవ మొదలైంది. గొడవ తీవ్ర స్థాయికి చేరడంతో పదునైన కత్తితో రవిపై దాడికి దిగారు దుండగులు. కత్తి పోట్లకు గురైన రవి అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ ఘటనలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రవికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. రవి మృతితో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తండ్రి మృతితో కన్నీరు మున్నీరు అవుతున్నారు పిల్లలు.

ఘటన జరిగిన చర్ల రోడ్డులోని వైన్ షాప్ దగ్గర ఆందోళన చేపట్టారు రవి కుటుంబసభ్యులు. బ్రిడ్జి చెక్ పోస్ట్ దగ్గర ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ప్రాణానికి ప్రాణం తీసుకుంటామని.. హత్య చేసిన నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు రవి కుటుంబసభ్యులు. ఈ క్రమంలో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది.