బోయిన్ పల్లి పెట్రోల్ బంక్ లో అగ్ని ప్రమాదం.. పెట్రోల్ పోస్తుండగా తగలబడ్డ బైక్

బోయిన్ పల్లి పెట్రోల్ బంక్ లో అగ్ని ప్రమాదం.. పెట్రోల్ పోస్తుండగా తగలబడ్డ బైక్

సికింద్రాబాద్   బోయిన్ పల్లిలో పెను ప్రమాదం తప్పింది.  భారత్ పెట్రోల్ బంక్ లో   పెట్రోల్ పోస్తుండగా  బైక్ లో ఒక్కసారిగా  మంటలు ఎగసిపడ్డాయి.  అప్రమత్తమైన స్థానికులు వెంటనే  బైక్ ను దూరంగా  లాక్కెళ్ళడంతో  పెను ప్రమాదం తప్పింది. 

 బైక్ ను దూరంగా తీసుకెళ్లి మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో బైక్ పూర్తిగా దగ్ధం అయ్యింది. పెట్రోలో బంక్ కావడంతో స్థానికులు  భయాందోళనకు గురయ్యారు.  ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. 

►ALSO READ | కామారెడ్డి జిల్లాలో వరదల్లో చిక్కుకొని ట్యాంకర్ ఎక్కిన కార్మికులు.. కాపాడి ఒడ్డుకు చేర్చిన ఎన్డీఆర్ఎఫ్..